(॥పల్లవి॥)
వేగిరించకురే వెలఁదులాల
బాగుగా నా రమణుఁడు పాడెఱఁగఁడా
(॥॥)
దగ్గరి వచ్చినవాఁడు తనే మాటాడఁడా
యెగ్గువట్టీ నుండరే యిదేమనక
బగ్గన రమ్మన్నవాఁడు పైకొనక మానునా
సిగ్గువడీ మానరే చేరి విన్నవించక
(॥॥)
నన్ను మన్నించినవాఁడు నవ్వక మానీనా
సన్నలు సేయకురే జడిసీఁ దాను
అన్నిటా వలచినాఁడు ఆదరించకుండునా
యిన్నేసి దూరకురే యేమనీనో అతఁడు
(॥॥)
ఇయ్యకొనొనట్టివాఁడు ఇటమీఁదెఱఁగఁడా
కొయ్యతనాలాడకురే కోపగించీని
ఇయ్యెడనే శ్రీ వేంకటేశుఁడిట్టె నన్నుఁ గూడె
నెయ్యములె నెరపరే నిండుదొర ఇతఁడు
(||pallavi||)
vegiriṁchagure vĕlam̐dulāla
bāgugā nā ramaṇum̐ḍu pāḍĕṟam̐gam̐ḍā
(||||)
daggari vachchinavām̐ḍu tane māḍāḍam̐ḍā
yĕgguvaṭṭī nuṁḍare yidemanaga
baggana rammannavām̐ḍu paigŏnaga mānunā
sigguvaḍī mānare seri vinnaviṁchaga
(||||)
nannu manniṁchinavām̐ḍu navvaga mānīnā
sannalu seyagure jaḍisīm̐ dānu
anniḍā valasinām̐ḍu ādariṁchaguṁḍunā
yinnesi dūragure yemanīno adam̐ḍu
(||||)
iyyagŏnŏnaṭṭivām̐ḍu iḍamīm̐dĕṟam̐gam̐ḍā
kŏyyadanālāḍagure kobagiṁchīni
iyyĕḍane śhrī veṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐ gūḍĕ
nĕyyamulĕ nĕrabare niṁḍudŏra idam̐ḍu