వేగిరించకురే మీరు వెలఁదులాల
(॥పల్లవి॥)
వేగిరించకురే మీరు వెలఁదులాల
సోగ కన్నులఁ దప్పక చూచేఁ గాక
(॥వేగి॥)
సరసములాడఁగాను జంకించ వచ్చునా
తెరువేదో పతిమతిఁ దెలిసేఁగాక
శిరసు వంచుకుండఁగానుఁ జేరి తిట్టవచ్చునా
ఆరుదైన సుద్దులెల్లా నడిగేఁ గాక
(॥వేగి॥)
తగ్గక కూచుండఁగాను తలమనవచ్చునా
వెగ్గళించక మాటలు వినేఁ గాక
వొగ్గి వొడివట్టఁగాను వోప ననవచ్చునా
సిగ్గు వడుచు నూరకే చేత మొక్కేఁగాక
(॥వేగి॥)
యిట్టె కాఁగిలించఁగాను యీసడించ వచ్చునా
చుట్టిరికము తనది చూచేఁ గాక
వొట్టుక శ్రీవేంకటేశుఁ డొద్దికతో నను నెల
నెట్టుకొన్న మోహముతో నిండుకుండేఁ గాక
(||pallavi||)
vegiriṁchagure mīru vĕlam̐dulāla
soga kannulam̐ dappaga sūsem̐ gāga
(||vegi||)
sarasamulāḍam̐gānu jaṁkiṁcha vachchunā
tĕruvedo padimadim̐ dĕlisem̐gāga
śhirasu vaṁchuguṁḍam̐gānum̐ jeri tiṭṭavachchunā
ārudaina suddulĕllā naḍigem̐ gāga
(||vegi||)
taggaga kūsuṁḍam̐gānu talamanavachchunā
vĕggaḽiṁchaga māḍalu vinem̐ gāga
vŏggi vŏḍivaṭṭam̐gānu voba nanavachchunā
siggu vaḍusu nūrage seda mŏkkem̐gāga
(||vegi||)
yiṭṭĕ kām̐giliṁcham̐gānu yīsaḍiṁcha vachchunā
suṭṭirigamu tanadi sūsem̐ gāga
vŏṭṭuga śhrīveṁkaḍeśhum̐ ḍŏddigado nanu nĕla
nĕṭṭugŏnna mohamudo niṁḍuguṁḍem̐ gāga