Vegirimcha naagela vesaranela

వేగిరించ నాకేల వేసరనేల
Language

(॥పల్లవి॥)
వేగిరించ నాకేల వేసరనేల
చేగదేర మొక్కఁగా నీ చిత్తము నా భాగ్యము

(॥॥)
నిన్నుఁ జూచి చూచి నేను నేరము లెంచనేర
సన్నలనే చలములు సాదించనేర
కిన్నెరమీటుచు నిన్ను గిలిగించి పాడిపాడి
విన్నపము సేసుకోఁగా వెసఁ గరుణించేవు

(॥॥)
తఱివులు పెట్టి పెట్టి తమి నలయించనోప
గుఱిలేనిమాటలకుఁ గొసరనోప
అఱిముఱి నీపై వల పాకులలో వాఁసి వాఁసి
యెఱుకసేసి యంపఁగా నిట్టె నన్నేలేవు

(॥॥)
పొలసి పొలసి సారె బొమ్మల జంకించఁజాల
బలిమి సేసి నిన్నుఁ బంగించఁజాల
యెలమి శ్రీ వేంకటేశ ఇదె నీకాఁగిటఁ గూడి
నిలుచున్నదాన నిఁక నీవే మెచ్చేవు

(||pallavi||)
vegiriṁcha nāgela vesaranela
segadera mŏkkam̐gā nī sittamu nā bhāgyamu

(||||)
ninnum̐ jūsi sūsi nenu neramu lĕṁchanera
sannalane salamulu sādiṁchanera
kinnĕramīḍusu ninnu giligiṁchi pāḍibāḍi
vinnabamu sesugom̐gā vĕsam̐ garuṇiṁchevu

(||||)
taṟivulu pĕṭṭi pĕṭṭi tami nalayiṁchanoba
guṟilenimāḍalagum̐ gŏsaranoba
aṟimuṟi nībai vala pāgulalo vām̐si vām̐si
yĕṟugasesi yaṁpam̐gā niṭṭĕ nannelevu

(||||)
pŏlasi pŏlasi sārĕ bŏmmala jaṁkiṁcham̐jāla
balimi sesi ninnum̐ baṁgiṁcham̐jāla
yĕlami śhrī veṁkaḍeśha idĕ nīgām̐giḍam̐ gūḍi
nilusunnadāna nim̐ka nīve mĕchchevu