(॥పల్లవి॥)
వేగిరించ మనకేల వింతవారమా
పోగు సేతము వలపు పొందుదాఁకా నతఁడు
(॥వేగి॥)
చేకొని యాపెయింటిలో చెలువుని మాటలయ్యీ
ఆకెఁదాను యేకతము లాడేరేమో
కాకు సేసినట్లయ్యీ గక్కన నేఁబిలిచితే
వాకిటఁ గాచుకుందము వచ్చుదాఁకా నతఁడు
(॥వేగి॥)
పట్టెమంచమొద్దు నవె పైఁడిపావా లాతనివి
అట్టె యాపెతో సరససాలాడీనేమో
పట్టితిఁ జొప్పులవిగో పచ్చి సేయ నిఁకనేల
గుట్టుతోఁ గోరుకొందము కూడుదాఁకా నతఁడు
(॥వేగి॥)
పచ్చడముఁ గదె పనులెల్లాఁ గానవచ్చె
అచ్చముగాఁ గూడెనేమో ఆకె నిందాఁక
ఇచ్చకుఁడు శ్రీ వేంకటేశుఁడు నన్నిటు గూడె
నచ్చుల గిలిగింతము నవ్వుదాఁకా నతఁడు
(||pallavi||)
vegiriṁcha managela viṁtavāramā
pogu sedamu valabu pŏṁdudām̐kā nadam̐ḍu
(||vegi||)
segŏni yābĕyiṁṭilo sĕluvuni māḍalayyī
āgĕm̐dānu yegadamu lāḍeremo
kāgu sesinaṭlayyī gakkana nem̐biliside
vāgiḍam̐ gāsuguṁdamu vachchudām̐kā nadam̐ḍu
(||vegi||)
paṭṭĕmaṁchamŏddu navĕ paim̐ḍibāvā lādanivi
aṭṭĕ yābĕdo sarasasālāḍīnemo
paṭṭidim̐ jŏppulavigo pachchi seya nim̐kanela
guṭṭudom̐ gorugŏṁdamu kūḍudām̐kā nadam̐ḍu
(||vegi||)
pachchaḍamum̐ gadĕ panulĕllām̐ gānavachchĕ
achchamugām̐ gūḍĕnemo āgĕ niṁdām̐ka
ichchagum̐ḍu śhrī veṁkaḍeśhum̐ḍu nanniḍu gūḍĕ
nachchula giligiṁtamu navvudām̐kā nadam̐ḍu