Vegirimcha kamtesi trivikramu

వేగిరించ కంతేసి త్రివిక్రము
Language

(॥పల్లవి॥)
వేగిరించ కంతేసి త్రివిక్రము
వేగుఁజుక్క రానీ త్రివిక్రమ

(॥వేగి॥)
వేసరించఁ జుమ్మీ త్రివిక్రమ నిన్ను
వీసమంతపనికే త్రివిక్రమ
వేసేవు పూవులను త్రివిక్రమా మేని
వేసురుఁ జెమటల త్రివిక్రమ

(॥వేగి॥)
వెన్నెలలో నవ్వకు త్రివిక్రమా కన్న
విన్నవారేమందురో త్రివిక్రమా
విన్నాణపుచేఁతల త్రివిక్రమా
వెన్నగారీ నీ మోవి త్రివిక్రమా

(॥వేగి॥)
వెడజారెఁ దురుము త్రివిక్రమా నన్ను
విడిదిలోఁ గూడితి త్రివిక్రమా
విడువ శ్రీవేంకటత్రివిక్రమా నీ
విడియుడి మెచ్చితి త్రివిక్రమా

(||pallavi||)
vegiriṁcha kaṁtesi trivikramu
vegum̐jukka rānī trivikrama

(||vegi||)
vesariṁcham̐ jummī trivikrama ninnu
vīsamaṁtabanige trivikrama
vesevu pūvulanu trivikramā meni
vesurum̐ jĕmaḍala trivikrama

(||vegi||)
vĕnnĕlalo navvagu trivikramā kanna
vinnavāremaṁduro trivikramā
vinnāṇabusem̐tala trivikramā
vĕnnagārī nī movi trivikramā

(||vegi||)
vĕḍajārĕm̐ durumu trivikramā nannu
viḍidilom̐ gūḍidi trivikramā
viḍuva śhrīveṁkaḍatrivikramā nī
viḍiyuḍi mĕchchidi trivikramā