Vegiramela veyaneevolaa

వేగిరమేల వేయనీవోలా
Language

(॥పల్లవి॥)
వేగిరమేల వేయనీవోలా
ఆ గతులెల్లాను అయ్యీఁగాని

(॥వేగి॥)
వలవనిజోలి వలపువిరాలి
యెలమిని జరపే వేమిటికి
తెలిసితి నేనూ దిష్టముగాను
చెలిమి నిజమయితేఁ జెప్పేఁగాని

(॥వేగి॥)
గరివడ్డ పెసరు కందువకొసరు
యెఱిఁగినపనులే యేమిటికి
గుణియాయ నాకు గుదిగొన్నకాకు
తఱి వచ్చినప్పుడే తలపించేఁగాని

(॥వేగి॥)
కొండలనునుపుగొనకొన్నననుపు
యెండలు నీడలు యేమిటికి
అండనె శ్రీవేంకటాధిప నన్నే లితివి
పండుమోవి తేనె పరపేఁగాని

(||pallavi||)
vegiramela veyanīvolā
ā gadulĕllānu ayyīm̐gāni

(||vegi||)
valavanijoli valabuvirāli
yĕlamini jarabe vemiḍigi
tĕlisidi nenū diṣhṭamugānu
sĕlimi nijamayidem̐ jĕppem̐gāni

(||vegi||)
garivaḍḍa pĕsaru kaṁduvagŏsaru
yĕṟim̐ginabanule yemiḍigi
guṇiyāya nāgu gudigŏnnagāgu
taṟi vachchinappuḍe talabiṁchem̐gāni

(||vegi||)
kŏṁḍalanunubugŏnagŏnnananubu
yĕṁḍalu nīḍalu yemiḍigi
aṁḍanĕ śhrīveṁkaḍādhiba nanne lidivi
paṁḍumovi tenĕ parabem̐gāni