వేగిరమా యిప్పుడేమి విభుఁడవు నీవు నాకు
(॥పల్లవి॥)
వేగిరమా యిప్పుడేమి విభుఁడవు నీవు నాకు
భోగించే యప్పుడే నీవు పొసఁగి వుండేవు
(॥వేగి॥)
ఘనుఁడవు నిన్నుఁ గడు కరకరించ నేఁటికి
మనసువచ్చినప్పుడే మాటలాడేవు
పనివడి గిలిగించి బలలించనేమికి
ననిచినప్పుడే నీవు నవ్వు నవ్వేవు
(॥వేగి॥)
వెంట వెంటఁ దగులుచు విన్నవించనేమిటికి
యింటి వచ్చినప్పుడే యియ్యకొనేవు
దంటతనమున నీతోఁ దమకించనేమిటికి
నంటుగలయప్పడే నావాఁడ వయ్యేవు
(॥వేగి॥)
కైవసము గమ్మనుచు కాఁతాళించనేమిటికి
భావించి చూచినప్పుడే పైకొనేవు
శ్రీవేంకటేశుఁడవు చిమ్మిరేఁచనేమిటికి
యీవేళ నన్నేలితివి యిఁక నిట్టే మెచ్చేవు
(||pallavi||)
vegiramā yippuḍemi vibhum̐ḍavu nīvu nāgu
bhogiṁche yappuḍe nīvu pŏsam̐gi vuṁḍevu
(||vegi||)
ghanum̐ḍavu ninnum̐ gaḍu karagariṁcha nem̐ṭigi
manasuvachchinappuḍe māḍalāḍevu
panivaḍi giligiṁchi balaliṁchanemigi
nanisinappuḍe nīvu navvu navvevu
(||vegi||)
vĕṁṭa vĕṁṭam̐ dagulusu vinnaviṁchanemiḍigi
yiṁṭi vachchinappuḍe yiyyagŏnevu
daṁṭadanamuna nīdom̐ damagiṁchanemiḍigi
naṁṭugalayappaḍe nāvām̐ḍa vayyevu
(||vegi||)
kaivasamu gammanusu kām̐tāḽiṁchanemiḍigi
bhāviṁchi sūsinappuḍe paigŏnevu
śhrīveṁkaḍeśhum̐ḍavu simmirem̐sanemiḍigi
yīveḽa nannelidivi yim̐ka niṭṭe mĕchchevu