వేగిరకానికి నేఁడు వెసఁ బెట్టుమన్నట్టు
(॥పల్లవి॥)
వేగిరకానికి నేఁడు వెసఁ బెట్టుమన్నట్టు
ఆగడాలు సేయవచ్చే వాస ఇంకా నెంతో
(॥వేగి॥)
విన్నపాలు సేయఁగానే వేమరు బుద్దెడిగేవు
కన్నులను మొక్కఁగానే గరిసించేవు
చన్నుల నొత్తఁగానే సాములు సేయవచ్చేవు
ఇన్నిటా వేగిరించేవు యేమి దలఁచితివో
(॥వేగి॥)
విందుచెప్పరాఁగానే వెసఁ జవు లడిగేవు
పొందులు నేఁ జేయఁగానే పొదిగేవు
కందువకుఁ బిలువఁగా కడుఁదమకించేవు
సందడిఁ బెండ్లాడేవు జాణతన మెట్టిదో
(॥వేగి॥)
పానుపుపైఁ బండఁగానే పదరి కాఁగిలించేవు
ఆనుక మోవియ్యఁగానే ఆసపడేవు
కానీలే శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
సానఁబట్టేవు చూపులు సమరతు లెట్టివో
(||pallavi||)
vegiragānigi nem̐ḍu vĕsam̐ bĕṭṭumannaṭṭu
āgaḍālu seyavachche vāsa iṁkā nĕṁto
(||vegi||)
vinnabālu seyam̐gāne vemaru buddĕḍigevu
kannulanu mŏkkam̐gāne garisiṁchevu
sannula nŏttam̐gāne sāmulu seyavachchevu
inniḍā vegiriṁchevu yemi dalam̐sidivo
(||vegi||)
viṁdusĕpparām̐gāne vĕsam̐ javu laḍigevu
pŏṁdulu nem̐ jeyam̐gāne pŏdigevu
kaṁduvagum̐ biluvam̐gā kaḍum̐damagiṁchevu
saṁdaḍim̐ bĕṁḍlāḍevu jāṇadana mĕṭṭido
(||vegi||)
pānububaim̐ baṁḍam̐gāne padari kām̐giliṁchevu
ānuga moviyyam̐gāne āsabaḍevu
kānīle śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
sānam̐baṭṭevu sūbulu samaradu lĕṭṭivo