Vegiragaamdavu neevu vesalam bettumanevu

వేగిరకాఁడవు నీవు వెసలఁ బెట్టుమనేవు
Language

(॥పల్లవి॥)
వేగిరకాఁడవు నీవు వెసలఁ బెట్టుమనేవు
ఆగడము సేసి యేల అలయించేవు

(॥॥)
చలము పాదించరాదు జంకించి చూడఁగరాదు
యెలమి నింతలో నేరా యెగ్గుపట్టేవు
బలిమి చూపఁగరాదు పంతములాడఁగరాదు
తిలకించి యేమిరా తిట్టు దిట్టేవు

(॥॥)
బెట్టి మాటాడఁగరాదు బిగువు చూపఁగరాదు
ఱట్టు అదేరా ఇట్టె యేఁచేవు
గుట్టున నుండఁగరాదు కొసరి నవ్వఁగరాదు
వుట్టిపడి నీవేరా వుప్పతించేవు

(॥॥)
కదిసి పెనగరాదు కాగిలించుకొనరాదు
వుదుటున నౌరారా వొడివట్టేవు
ఇదివో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
పొదిగి యేమిటికిరా బుజ్జగించేవు

(||pallavi||)
vegiragām̐ḍavu nīvu vĕsalam̐ bĕṭṭumanevu
āgaḍamu sesi yela alayiṁchevu

(||||)
salamu pādiṁcharādu jaṁkiṁchi sūḍam̐garādu
yĕlami niṁtalo nerā yĕggubaṭṭevu
balimi sūbam̐garādu paṁtamulāḍam̐garādu
tilagiṁchi yemirā tiṭṭu diṭṭevu

(||||)
bĕṭṭi māḍāḍam̐garādu biguvu sūbam̐garādu
ṟaṭṭu aderā iṭṭĕ yem̐sevu
guṭṭuna nuṁḍam̐garādu kŏsari navvam̐garādu
vuṭṭibaḍi nīverā vuppadiṁchevu

(||||)
kadisi pĕnagarādu kāgiliṁchugŏnarādu
vuduḍuna naurārā vŏḍivaṭṭevu
idivo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
pŏdigi yemiḍigirā bujjagiṁchevu