వేగిర మిప్పుడే యేల వింతవారమా
(॥పల్లవి॥)
వేగిర మిప్పుడే యేల వింతవారమా
సోగల నివెల్ల నేఁడే సోద్యమా
(॥వేగి॥)
యీతల మెచ్చకయున్న నెదలో మెచ్చేవుగాక
ఆతల నిప్పుడే యేమి అవసరమా
ఘాత మోవి నవ్వకుంటు కన్నుల నవ్వేవుగాక
తోతో ఇంతన యేమి దోసమా
(॥వేగి॥)
యెదుట మాటాడకున్న నింటిలో నాడేవు గాక
పదరి నీమీఁద నేను పై తరవా
మదిరేపట రాకుంటే మాపట వచ్చేవుగాక
కదిసి ఇప్పుడు యేమి కక్కూరితా
(॥వేగి॥)
రచ్చల వీఁగకయున్న రతుల వీఁగేవుగాక
వచ్చివచ్చి నీతోడ వావాదమా
పచ్చిగా శ్రీవేంకటేశ పైకొనికూడితి నిట్టె
గచ్చుల నీగుణ మిది కానమా
(||pallavi||)
vegira mippuḍe yela viṁtavāramā
sogala nivĕlla nem̐ḍe sodyamā
(||vegi||)
yīdala mĕchchagayunna nĕdalo mĕchchevugāga
ādala nippuḍe yemi avasaramā
ghāda movi navvaguṁṭu kannula navvevugāga
todo iṁtana yemi dosamā
(||vegi||)
yĕduḍa māḍāḍagunna niṁṭilo nāḍevu gāga
padari nīmīm̐da nenu pai taravā
madirebaḍa rāguṁṭe mābaḍa vachchevugāga
kadisi ippuḍu yemi kakkūridā
(||vegi||)
rachchala vīm̐gagayunna radula vīm̐gevugāga
vachchivachchi nīdoḍa vāvādamā
pachchigā śhrīveṁkaḍeśha paigŏnigūḍidi niṭṭĕ
gachchula nīguṇa midi kānamā