వేగిర మింతలో నేల విసుగునేల
(॥పల్లవి॥)
వేగిర మింతలో నేల విసుగునేల
బాగులెల్లఁ జక్కనయ్యీ పంతమాడనీవే
(॥వేగి॥)
కిలకిల నవ్వుకొంటా కేఁగంటఁ జూచుకొంటా
వలపులు పైఁజల్ల వచ్చీ వాఁడే
యెలమి నిందాఁకా దానెక్కడ నుండెనోకాని
తలఁపెల్లఁ గనుకొనే దగ్గరి రానీవే
(॥వేగి॥)
వారి వీరిఁ జూచుకొంటా వసివాడు వాడుకొంటా
నేరుపులు వీధి వీధి నించీ వాఁడే
ఈరీతి నాతోడనిఁక నేమని బొంకెనో కాని
తేరీనన్ని పనులు తెల్లవారనీవే
(॥వేగి॥)
యిచ్చకములాడుకొంటా నెఱఁగమి సేసుకొంటా
వెచ్చనిమేను మీఁద వేసీ వాఁడే
యిచ్చట శ్రీవేంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
బచ్చనలోకటొకటే పచరించనీవే
(||pallavi||)
vegira miṁtalo nela visugunela
bāgulĕllam̐ jakkanayyī paṁtamāḍanīve
(||vegi||)
kilagila navvugŏṁṭā kem̐gaṁṭam̐ jūsugŏṁṭā
valabulu paim̐jalla vachchī vām̐ḍe
yĕlami niṁdām̐kā dānĕkkaḍa nuṁḍĕnogāni
talam̐pĕllam̐ ganugŏne daggari rānīve
(||vegi||)
vāri vīrim̐ jūsugŏṁṭā vasivāḍu vāḍugŏṁṭā
nerubulu vīdhi vīdhi niṁchī vām̐ḍe
īrīdi nādoḍanim̐ka nemani bŏṁkĕno kāni
terīnanni panulu tĕllavāranīve
(||vegi||)
yichchagamulāḍugŏṁṭā nĕṟam̐gami sesugŏṁṭā
vĕchchanimenu mīm̐da vesī vām̐ḍe
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ
bachchanalogaḍŏgaḍe pasariṁchanīve