Vegira memtigini vesada lemtigini vishnuni solayamga nela

వేగిర మేఁటికిని వేసట లేఁటికిని విష్ణుని సొలయఁగ నేల
Language

(॥పల్లవి॥)
వేగిర మేఁటికిని వేసట లేఁటికిని విష్ణుని సొలయఁగ నేల
సాగిలి మొక్క నతఁడు మన్ననలు జరపిన పాటి జరపీఁ గాక

(॥వేగిరి॥)
తనవేలే తనకన్ను దాఁకినను తాన నెవ్వనిఁ గోపించీని
తనకర్మమే తన్నుఁ జేయఁగదైవము దూరఁగ నేల
అనుభవింపుచును హరినే కొలచిన అలమట లన్నియు హరిచూచి
పొనుఁగక తమలో దుర్దోషంబులు పొమ్మనపుడే పోయీఁగాక

(॥వేగిరి॥)
కడుపులోపలికి మింగినరత్నము కడుచోట్ల వెదకిఁగ నేల
బడిఁ దన యంతర్యామి దా మఱచి పలువేల్పులఁ గొలువఁగ నేల
విడువక శ్రీపతినామమంత్రమే వేడుకఁ దలఁచఁగఁ దలఁచఁగను
చెడకుండా నతఁడు పావనము సేసినప్పుడే సేసీఁగాక

(॥వేగిరి॥)
కర్మము నతఁడే కార్యము నతఁడే కడఁగిన శ్రీ వేంకటవిభుఁడూ
నిర్మించినట్లవు నిన్నియు మరి నేఁ డనుమానము లేల
ధర్మం బితనికి యేకాలంబున దాసుల రక్షించే బిరుదు
అర్మిలి యితనిఁ గొలిచినఁ జాలునుఅందని పదవులు నందీఁగాక

(||pallavi||)
vegira mem̐ṭigini vesaḍa lem̐ṭigini viṣhṇuni sŏlayam̐ga nela
sāgili mŏkka nadam̐ḍu mannanalu jarabina pāḍi jarabīm̐ gāga

(||vegiri||)
tanavele tanagannu dām̐kinanu tāna nĕvvanim̐ gobiṁchīni
tanagarmame tannum̐ jeyam̐gadaivamu dūram̐ga nela
anubhaviṁpusunu harine kŏlasina alamaḍa lanniyu harisūsi
pŏnum̐gaga tamalo durdoṣhaṁbulu pŏmmanabuḍe poyīm̐gāga

(||vegiri||)
kaḍubulobaligi miṁginaratnamu kaḍusoṭla vĕdagim̐ga nela
baḍim̐ dana yaṁtaryāmi dā maṟasi paluvelbulam̐ gŏluvam̐ga nela
viḍuvaga śhrībadināmamaṁtrame veḍugam̐ dalam̐sam̐gam̐ dalam̐sam̐ganu
sĕḍaguṁḍā nadam̐ḍu pāvanamu sesinappuḍe sesīm̐gāga

(||vegiri||)
karmamu nadam̐ḍe kāryamu nadam̐ḍe kaḍam̐gina śhrī veṁkaḍavibhum̐ḍū
nirmiṁchinaṭlavu ninniyu mari nem̐ ḍanumānamu lela
dharmaṁ bidanigi yegālaṁbuna dāsula rakṣhiṁche birudu
armili yidanim̐ gŏlisinam̐ jālunuaṁdani padavulu naṁdīm̐gāga