వేగిర మేలే కొసరు వేరే వుండఁగా నా
(॥పల్లవి॥)
వేగిర మేలే కొసరు వేరే వుండఁగా నా-
తీగె కళల మోమైనా దెలిపించీఁ గాక
(॥వేగిర॥)
దాపగు నామనసే తల కెక్క వలపించె
పాపము తన్నన నేలే బతుకుఁ గాక
యేపున నిపు డేమాయ హృదయములోనుచొచ్చి
చూపులు నావైనాఁ దను సూడువట్టీఁ గాక
(॥వేగిర॥)
వెక్కసపు వయసే విరహము పెరరేచే
పక్కన వాడు లింకేలే బతుకు గాక
కక్కసము వలెనా ఘన మర్మములు రాఁగి
చక్కదనము నాదైనా సాదించీ గాక
(॥వేగిర॥)
వింతగు నావాపులే వీడు దొడు లాడించె
పంతము దనతో నేలే బతుకు గాక
అంతటి శ్రీవేంకటేశు డన్నిటా నన్ను గూడె
యెంత కైనా నాచలమే యియ్యకొనీఁ గాక
(||pallavi||)
vegira mele kŏsaru vere vuṁḍam̐gā nā-
tīgĕ kaḽala momainā dĕlibiṁchīm̐ gāga
(||vegira||)
dābagu nāmanase tala kĕkka valabiṁchĕ
pābamu tannana nele badugum̐ gāga
yebuna nibu ḍemāya hṛdayamulonusŏchchi
sūbulu nāvainām̐ danu sūḍuvaṭṭīm̐ gāga
(||vegira||)
vĕkkasabu vayase virahamu pĕrarese
pakkana vāḍu liṁkele badugu gāga
kakkasamu valĕnā ghana marmamulu rām̐gi
sakkadanamu nādainā sādiṁchī gāga
(||vegira||)
viṁtagu nāvābule vīḍu dŏḍu lāḍiṁchĕ
paṁtamu danado nele badugu gāga
aṁtaḍi śhrīveṁkaḍeśhu ḍanniḍā nannu gūḍĕ
yĕṁta kainā nāsalame yiyyagŏnīm̐ gāga