వేగినంతా నేమి చెప్పే వెలుమ జోలి
(॥పల్లవి॥)
వేగినంతా నేమి చెప్పే వెలుమ జోలి
వాగమై నాకు మేనవాఁ డౌనో కాఁడో
(॥వేగి॥)
యెగసక్కేలకు నాతో నేమైన ననెఁగాక
అగపడి నాకు లోనౌనో కాఁడో
నగుతా నెంతైనాఁ బెనఁగినాఁ బెనఁగెఁ గాకఁ
తగవున కిపుడు నామొగఁడౌనో కాఁడో
(॥వేగి॥)
యెమ్మెలకుఁ దా మరి యెట్టుండినా నుండెఁ గాక
యిమ్ముల నాకుఁ జనవిచ్చెనో లేదో
వుమ్మడితా సిగ్గుపడి వుండినా నుండెఁ గాక
కమ్మర మొదల నన్నుఁ గౌకొనెనో లేదో
(॥వేగి॥)
దిమ్మరియై ఇట్టె సాదించితే సాదించెఁ గాక
నమ్మించి నన్నిట్టె యెనసెనో లేదో
పమ్మి శ్రీ వేంకటేశుఁడు పైకొంటేఁ బైకనెఁ గాక
నెమ్మదిఁ గృపారసము నించెనో లేదో
(||pallavi||)
veginaṁtā nemi sĕppe vĕluma joli
vāgamai nāgu menavām̐ ḍauno kām̐ḍo
(||vegi||)
yĕgasakkelagu nādo nemaina nanĕm̐gāga
agabaḍi nāgu lonauno kām̐ḍo
nagudā nĕṁtainām̐ bĕnam̐ginām̐ bĕnam̐gĕm̐ gāgam̐
tagavuna kibuḍu nāmŏgam̐ḍauno kām̐ḍo
(||vegi||)
yĕmmĕlagum̐ dā mari yĕṭṭuṁḍinā nuṁḍĕm̐ gāga
yimmula nāgum̐ janavichchĕno ledo
vummaḍidā siggubaḍi vuṁḍinā nuṁḍĕm̐ gāga
kammara mŏdala nannum̐ gaugŏnĕno ledo
(||vegi||)
dimmariyai iṭṭĕ sādiṁchide sādiṁchĕm̐ gāga
nammiṁchi nanniṭṭĕ yĕnasĕno ledo
pammi śhrī veṁkaḍeśhum̐ḍu paigŏṁṭem̐ baiganĕm̐ gāga
nĕmmadim̐ gṛpārasamu niṁchĕno ledo