వేగినంతా నీరాకకే వేడుక నెదురుచూచె
(॥పల్లవి॥)
వేగినంతా నీరాకకే వేడుక నెదురుచూచె
చేగలెక్కే నీ గుణాలు చెల్లఁబెట్టవలదా
(॥వేగి॥)
నీ మాఁట నీకు వచ్చె నిన్ననే బాసిచ్చితివి
రామతో వచ్చేనని రావైతివి
కోమల మాపెమనసు కొండవంటివాఁడవు
బూమిలోన నిజములే పోగుసేయవలదా
(॥వేగి॥)
నీకొప్పగించితి మిదె నేఁడే లేకలంపితివి
చేకొని వ్రాసినట్టే సేయవైతివి
వాకుల వాసులదాపె వారిధివంటివాఁడవు
యీకడ నీ ప్రతినలు యీడేరించవలదా
(॥వేగి॥)
యెచ్చరించితిమి నేము యిట్టే నీవు వచ్చితివి
పచ్చిగా మగువఁ గూడి పాయవైతివి
మెచ్చుల చక్కనిదాపె మేఘమువంటివాఁడవు
మచ్చిక శ్రీవేంకటేశ మన్నించవలదా
(||pallavi||)
veginaṁtā nīrāgage veḍuga nĕdurusūsĕ
segalĕkke nī guṇālu sĕllam̐bĕṭṭavaladā
(||vegi||)
nī mām̐ṭa nīgu vachchĕ ninnane bāsichchidivi
rāmado vachchenani rāvaidivi
komala mābĕmanasu kŏṁḍavaṁṭivām̐ḍavu
būmilona nijamule poguseyavaladā
(||vegi||)
nīgŏppagiṁchidi midĕ nem̐ḍe legalaṁpidivi
segŏni vrāsinaṭṭe seyavaidivi
vāgula vāsuladābĕ vāridhivaṁṭivām̐ḍavu
yīgaḍa nī pradinalu yīḍeriṁchavaladā
(||vegi||)
yĕchchariṁchidimi nemu yiṭṭe nīvu vachchidivi
pachchigā maguvam̐ gūḍi pāyavaidivi
mĕchchula sakkanidābĕ meghamuvaṁṭivām̐ḍavu
machchiga śhrīveṁkaḍeśha manniṁchavaladā