Veggalimcham joosidenu vesadalainu

వెగ్గళించఁ జూచితేను వేసటలైను
Language

(॥పల్లవి॥)
వెగ్గళించఁ జూచితేను వేసటలైను - అందు
వెగ్గళమైతే వలపు వెల్లివిరిసీని

(॥॥)
సగము మాటాడవే వోసతి నీవాతనిచేత
సగము దెలుసుకొనేజాడ యెట్టిదో
తగులు గొంత చూపవే తరవాత నాతనికిఁ
దగులు గలిగితేను తమకించీ నిపుడు

(॥॥)
మొదలఁ గొంత నవ్వవే మోహానకు నీకతఁడు
మొదలుఁ దుదా గలితే ముంచి నవ్వీని
యెదురు చూడవే మొక మెదురుకట్లఁ దాను
యెదురు చూచి రతికి నితవు గలితేను

(॥॥)
చేయి చాఁచవే నీవు శ్రీవేంకటేశుఁడు రెండో
చేయివట్టి తీసి నీసిగ్గు వాపీని
యీయడనుండి కూడితి విన్నిటా నామాట విని
యీయెడనే అతడు నిన్నిదివో మన్నించె

(||pallavi||)
vĕggaḽiṁcham̐ jūsidenu vesaḍalainu - aṁdu
vĕggaḽamaide valabu vĕllivirisīni

(||||)
sagamu māḍāḍave vosadi nīvādaniseda
sagamu dĕlusugŏnejāḍa yĕṭṭido
tagulu gŏṁta sūbave taravāda nādanigim̐
dagulu galigidenu tamagiṁchī nibuḍu

(||||)
mŏdalam̐ gŏṁta navvave mohānagu nīgadam̐ḍu
mŏdalum̐ dudā galide muṁchi navvīni
yĕduru sūḍave mŏga mĕdurugaṭlam̐ dānu
yĕduru sūsi radigi nidavu galidenu

(||||)
seyi sām̐save nīvu śhrīveṁkaḍeśhum̐ḍu rĕṁḍo
seyivaṭṭi tīsi nīsiggu vābīni
yīyaḍanuṁḍi kūḍidi vinniḍā nāmāḍa vini
yīyĕḍane adaḍu ninnidivo manniṁchĕ