Vegame yaanadeevammaa vina vedugayyee naagu

వేగమే యానతీవమ్మా విన వేడుకయ్యీ నాకు
Language

(॥పల్లవి॥)
వేగమే యానతీవమ్మా విన వేడుకయ్యీ నాకు
యీ గతి నున్నవి నీ ఇంగితాకారములు

(॥వేగ॥)
కాంతునిమై గురుతులు కంటివో యేమైనాను
చెంతనుండి నవ్వేవు చిరునవ్వులు
వింత సుద్దు లేమైనా వింటివో యాతనిమీఁద
ఇంతలోనే చెలులతో నేకాంతా లాడేవు

(॥వేగ॥)
చేతికి నంగమచ్చాలు చిక్కెనో నీకేమైనా
కాతరాన సొలసేవు కమ్మటి నీవు
నీ తలపున నేమైనా నెపములు వారెనో
పోతరించి లోలోఁ దలపోసుకోనేవు

(॥వేగ॥)
నిక్కముగా నాతని నిజము దెలిసితివో
గక్కన శ్రీవేంకటేశు గాఁగిలించేవు
ఇక్కువలు గరఁగి నీ యెన్నిక లీడేరెనో
వుక్కుమీరి కలలెల్లా నుప్పతిలీ నీకును

(||pallavi||)
vegame yānadīvammā vina veḍugayyī nāgu
yī gadi nunnavi nī iṁgidāgāramulu

(||vega||)
kāṁtunimai gurudulu kaṁṭivo yemainānu
sĕṁtanuṁḍi navvevu sirunavvulu
viṁta suddu lemainā viṁṭivo yādanimīm̐da
iṁtalone sĕlulado negāṁtā lāḍevu

(||vega||)
sedigi naṁgamachchālu sikkĕno nīgemainā
kādarāna sŏlasevu kammaḍi nīvu
nī talabuna nemainā nĕbamulu vārĕno
podariṁchi lolom̐ dalabosugonevu

(||vega||)
nikkamugā nādani nijamu dĕlisidivo
gakkana śhrīveṁkaḍeśhu gām̐giliṁchevu
ikkuvalu garam̐gi nī yĕnniga līḍerĕno
vukkumīri kalalĕllā nuppadilī nīgunu