వేగమే రాఁగదవయ్య వెలఁదిఁ జూతువుగాని
(॥పల్లవి॥)
వేగమే రాఁగదవయ్య వెలఁదిఁ జూతువుగాని
జాగులెల సేసేవు సరసుఁడవు నీవు
(॥వేగ॥)
తలపోఁతలనె కొంతతడవు పొద్దులువుచ్చు
చెలికత్తెలతో కొంతసేప పొద్దులువుచ్చు
చిలుకలకుఁ జదువుచెప్పి కొంతపొద్దువుచ్చు
వెలసి నిన్నుఁ బాసినవిరహన మగువ
(॥వేగ॥)
నీమీఁదిపాటలు వాడి నెమ్మిఁ కొంతపొద్దువుచ్చు
దీమసాన సిగ్గులనే తేరి కొంతపొద్దువుచ్చు
ఆముకొన్న ఆసలనే అటు కొంతపొద్దువుచ్చు
వేమరు నిన్నుఁ బాసినవిరహనఁ దరుణి
(॥వేగ॥)
యెదురుచూపులనే ఇంటఁ గొంతపొద్దువుచ్చు
కదిసేటికోరికలఁ గడుఁ గొంతపొద్దువుచ్చు
ఇదివొ శ్రీవేంకటేశ ఇంతలొ వచ్చి కూడితి
వెదఁకీ జల్లారినవిరహన వనిత
(||pallavi||)
vegame rām̐gadavayya vĕlam̐dim̐ jūduvugāni
jāgulĕla sesevu sarasum̐ḍavu nīvu
(||vega||)
talabom̐talanĕ kŏṁtadaḍavu pŏdduluvuchchu
sĕligattĕlado kŏṁtaseba pŏdduluvuchchu
silugalagum̐ jaduvusĕppi kŏṁtabŏdduvuchchu
vĕlasi ninnum̐ bāsinavirahana maguva
(||vega||)
nīmīm̐dibāḍalu vāḍi nĕmmim̐ kŏṁtabŏdduvuchchu
dīmasāna siggulane teri kŏṁtabŏdduvuchchu
āmugŏnna āsalane aḍu kŏṁtabŏdduvuchchu
vemaru ninnum̐ bāsinavirahanam̐ daruṇi
(||vega||)
yĕdurusūbulane iṁṭam̐ gŏṁtabŏdduvuchchu
kadiseḍigorigalam̐ gaḍum̐ gŏṁtabŏdduvuchchu
idivŏ śhrīveṁkaḍeśha iṁtalŏ vachchi kūḍidi
vĕdam̐kī jallārinavirahana vanida