Vega taayano kaaga virasamo tamalona

వెగ టాయనో కాక విరసమో తమలోన
Language

(॥పల్లవి॥)
వెగ టాయనో కాక విరసమో తమలోన
చిగురుఁ గైదువవాఁడు చేసినట్టి మాయలో

(॥వెగ టా॥)
వెన్నెలలు గోలుఁ గాక వేడుకఁ జకోరాలు
వెన్నెల లుమియఁజొచ్చే విధ మేఁటిదే
సన్నపుఁ దుమ్మెద లెల్లా జలజమే చేరుఁ గాక
సన్నల నొకటొకటి జారిన దేఁటిదే

(॥వెగ టా॥)
జలమును లత లెల్లా సరి దాఁ జేకొనుఁ గాక
జలము తాఁ గుమ్మరించే జాడలేఁటికే
మెలుపు సంపంగె వుమీఁదగాలి మించుఁ గాక
పొలసి సంపెంగలోనఁ బొడమునాగాలి

(॥వెగ టా॥)
జక్కవలుజంట గూడిసమ్మతించుఁగాక నేఁడు
జక్కవ లొండొకటితో జరసీ నేమే
యెక్కువ శ్రీవేంకటేశుఁ డింతితోఁ గూడఁగ నేఁడు
వక్కణించుఁ దొల్లింటివలె నాయఁ గాలమూ

(||pallavi||)
vĕga ṭāyano kāga virasamo tamalona
sigurum̐ gaiduvavām̐ḍu sesinaṭṭi māyalo

(||vĕga ṭā||)
vĕnnĕlalu golum̐ gāga veḍugam̐ jagorālu
vĕnnĕla lumiyam̐jŏchche vidha mem̐ṭide
sannabum̐ dummĕda lĕllā jalajame serum̐ gāga
sannala nŏgaḍŏgaḍi jārina dem̐ṭide

(||vĕga ṭā||)
jalamunu lada lĕllā sari dām̐ jegŏnum̐ gāga
jalamu tām̐ gummariṁche jāḍalem̐ṭige
mĕlubu saṁpaṁgĕ vumīm̐dagāli miṁchum̐ gāga
pŏlasi saṁpĕṁgalonam̐ bŏḍamunāgāli

(||vĕga ṭā||)
jakkavalujaṁṭa gūḍisammadiṁchum̐gāga nem̐ḍu
jakkava lŏṁḍŏgaḍido jarasī neme
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍiṁtidom̐ gūḍam̐ga nem̐ḍu
vakkaṇiṁchum̐ dŏlliṁṭivalĕ nāyam̐ gālamū