Veeri vaarivale nenu vimtadaananaa

వీరి వారివలె నేను వింతదాననా
Language

(॥పల్లవి॥)
వీరి వారివలె నేను వింతదాననా
నేరక నీ వుండినాను నే మెచ్చక మానను

(॥వీరి వారి॥)
వలచిన మేలు నీవు వలవ కున్నా మేలు
తలఁపు నీమీఁద నాకుఁ దగిలి పోదు
అలిమి పట్టఁగ వద్దు ఆనలు వెట్టఁగ వద్దు
చెలిమి నీతో నెవుడుఁ జేయక నే మానను

(॥వీరి వీరి॥)
యింటికి వచ్చిన మేలు యేడ నున్నా మేలు నీ
వెంట వెంటఁ దిరిగి సేవించక పోను
తొంటిపొందు చెప్ప వద్దు దొమ్మిఁ జెక్కు నొక్క వద్దు
అంటి ముట్టి సరసము లాడక నే మాననూ

(॥వీరి వారి॥)
యివ్వలమో మైన మేలు యెటువలె నున్న మేలు
నెవ్వగ దీరఁ గూడక నే మానను
రవ్వగ శ్రీవెంకటేశ రతిఁ జొక్కించితి విదె
పువ్వువలె నిన్ను నేఁ బొదుగక మానను

(||pallavi||)
vīri vārivalĕ nenu viṁtadānanā
neraga nī vuṁḍinānu ne mĕchchaga mānanu

(||vīri vāri||)
valasina melu nīvu valava kunnā melu
talam̐pu nīmīm̐da nāgum̐ dagili podu
alimi paṭṭam̐ga vaddu ānalu vĕṭṭam̐ga vaddu
sĕlimi nīdo nĕvuḍum̐ jeyaga ne mānanu

(||vīri vīri||)
yiṁṭigi vachchina melu yeḍa nunnā melu nī
vĕṁṭa vĕṁṭam̐ dirigi seviṁchaga ponu
tŏṁṭibŏṁdu sĕppa vaddu dŏmmim̐ jĕkku nŏkka vaddu
aṁṭi muṭṭi sarasamu lāḍaga ne mānanū

(||vīri vāri||)
yivvalamo maina melu yĕḍuvalĕ nunna melu
nĕvvaga dīram̐ gūḍaga ne mānanu
ravvaga śhrīvĕṁkaḍeśha radim̐ jŏkkiṁchidi vidĕ
puvvuvalĕ ninnu nem̐ bŏdugaga mānanu