Veerada neevada yimka vichchanavidi

వీరట నీవట యిఁక విచ్చనవిడి
Language

(॥పల్లవి॥)
వీరట నీవట యిఁక విచ్చనవిడి
కూరిములతో నిందాఁక గుట్టుతోడ నుంటివి

(॥వీరట॥)
దొరవై యుండియు నీవు తొయ్యలులతో నెల్ల
సరసములాడఁగాను చలి వాసెను
వరుసఁ జన్నులమీఁద వాడికెతో నప్పటిని
విరులఁగొని వేయఁగ వెరపెల్లఁ దీరెను

(॥వీరట॥)
బలు రాజసాననుండి పైపైఁ బేరుకొనుచు
చెలులఁ బిలువఁగాను సిగ్గు వాసెను
తలకొని బుజ్జగించి దండ గూచుండఁ బెట్టుక
కులికి నవ్వగ కొంకు గొసరెల్ల మానెను

(॥వీరట॥)
శ్రీవేంకటేశుఁడవై చేరి కాంతలఁ గూడఁగ
భావములో నందరికిఁ బచ్చిదేరెను
యీవేళనే నన్నుఁ గూడి యిందరికిఁ జెప్పఁగాను
వేవేలకు నాలోని వేడుకెల్లా మీరెను

(||pallavi||)
vīraḍa nīvaḍa yim̐ka vichchanaviḍi
kūrimulado niṁdām̐ka guṭṭudoḍa nuṁṭivi

(||vīraḍa||)
dŏravai yuṁḍiyu nīvu tŏyyalulado nĕlla
sarasamulāḍam̐gānu sali vāsĕnu
varusam̐ jannulamīm̐da vāḍigĕdo nappaḍini
virulam̐gŏni veyam̐ga vĕrabĕllam̐ dīrĕnu

(||vīraḍa||)
balu rājasānanuṁḍi paibaim̐ berugŏnusu
sĕlulam̐ biluvam̐gānu siggu vāsĕnu
talagŏni bujjagiṁchi daṁḍa gūsuṁḍam̐ bĕṭṭuga
kuligi navvaga kŏṁku gŏsarĕlla mānĕnu

(||vīraḍa||)
śhrīveṁkaḍeśhum̐ḍavai seri kāṁtalam̐ gūḍam̐ga
bhāvamulo naṁdarigim̐ bachchiderĕnu
yīveḽane nannum̐ gūḍi yiṁdarigim̐ jĕppam̐gānu
vevelagu nāloni veḍugĕllā mīrĕnu