Veenulu sallamgaa itte vinemgaaga

వీనులు చల్లఁగా ఇట్టె వినేఁగాక
Language

(॥పల్లవి॥)
వీనులు చల్లఁగా ఇట్టె వినేఁగాక
యీ నయగారి నీతో యెదురాడేనా

(॥వీను॥)
చందురుఁడు నీ చూపు ఆ చాయలది నామోము
సందడి నిందుకే యెట్టు సరియౌదును
చెంది నన్ను మన్నించి చెప్పేవు యీసమ్మంధము
ఇందు నీ చిత్తము కొలఁ దెదురాడేనా

(॥వీను॥)
పాము నీ పరపు ఆబాగులది నా యారు
సామిని యిందుకే యెట్టు సరి యౌదును
చేముట్టి చుట్టరికాలు చెప్పి నన్నుఁ బొదిగేవు
యేమనినా నీమాట కేదురాడేనా

(॥వీను॥)
చుట్టుఁ జక్రము కత్తి యా సూటివే నా కుచుములు
జట్టిగా నిందుకే యెట్టు సరి యౌదును
గుట్టున శ్రీ వేంకటేశ కూడితివి వావులకె
యెట్టు నన్నేలినా నీకు నెదురాడేనా

(||pallavi||)
vīnulu sallam̐gā iṭṭĕ vinem̐gāga
yī nayagāri nīdo yĕdurāḍenā

(||vīnu||)
saṁdurum̐ḍu nī sūbu ā sāyaladi nāmomu
saṁdaḍi niṁduge yĕṭṭu sariyaudunu
sĕṁdi nannu manniṁchi sĕppevu yīsammaṁdhamu
iṁdu nī sittamu kŏlam̐ dĕdurāḍenā

(||vīnu||)
pāmu nī parabu ābāguladi nā yāru
sāmini yiṁduge yĕṭṭu sari yaudunu
semuṭṭi suṭṭarigālu sĕppi nannum̐ bŏdigevu
yemaninā nīmāḍa kedurāḍenā

(||vīnu||)
suṭṭum̐ jakramu katti yā sūḍive nā kusumulu
jaṭṭigā niṁduge yĕṭṭu sari yaudunu
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍidivi vāvulagĕ
yĕṭṭu nannelinā nīgu nĕdurāḍenā