Veenulaaraa neeve idu vimduvu raave

వీనులారా నీవే ఇటు విందువు రావే
Language

(॥పల్లవి॥)
వీనులారా నీవే ఇటు విందువు రావే
ఆనవెట్టి పిలువఁగ నంపీఁ జెలులను

(॥॥)
పవళించి యున్నవాఁడు బాగా లియ్యవే పతికి-
నివల జూజ మేమాడే వింతులతోను
జవళిని చలములు సాదించేవేళ గాదిది
తివిరి పిలువుమంటాఁ దిట్టీఁ జెలులను

(॥॥)
ముందే మేలుకన్నవాఁడు మోము చూపవే పతికి
చెంది యేమిమాటాడేవు చిలుకతోను
గొందినే కాఁకలు రేఁచి కొసరేవేళ గాదిది
కందువకు నంపుమని కసరీఁ జెలులను

(॥॥)
చెనకి సేసవెట్టవే శ్రీ వేంకటపతికి
గునిసేవేమే ముద్దులు కోవిలతోను
యెనసితి విఁక బయలీఁదించేవేళ గాదిది
పెనఁగించుమనుచుఁ గుప్పించీఁ జెలులను

(||pallavi||)
vīnulārā nīve iḍu viṁduvu rāve
ānavĕṭṭi piluvam̐ga naṁpīm̐ jĕlulanu

(||||)
pavaḽiṁchi yunnavām̐ḍu bāgā liyyave padigi-
nivala jūja memāḍe viṁtuladonu
javaḽini salamulu sādiṁcheveḽa gādidi
tiviri piluvumaṁṭām̐ diṭṭīm̐ jĕlulanu

(||||)
muṁde melugannavām̐ḍu momu sūbave padigi
sĕṁdi yemimāḍāḍevu silugadonu
gŏṁdine kām̐kalu rem̐si kŏsareveḽa gādidi
kaṁduvagu naṁpumani kasarīm̐ jĕlulanu

(||||)
sĕnagi sesavĕṭṭave śhrī veṁkaḍabadigi
guniseveme muddulu koviladonu
yĕnasidi vim̐ka bayalīm̐diṁcheveḽa gādidi
pĕnam̐giṁchumanusum̐ guppiṁchīm̐ jĕlulanu