Veempu gaanaraamgaa daamgevidhamu nersugomtivi

వీఁపు గానరాఁగా దాఁగేవిధము నేర్చుకొంటివి
Language

(॥పల్లవి॥)
వీఁపు గానరాఁగా దాఁగేవిధము నేర్చుకొంటివి
మాపుదాఁకా నిందులోన మఱపున్నదా

(॥॥)
చొక్కపునీవూరిలోనిచుట్టరికా లడిగితే-
నెక్కడెక్కడో మాటలెల్లా నాడేవు
పక్కన నీ వెంతేసిపరాకులు సేసీనాను
మక్కళించి మాకింతలో మరపయ్యీనా

(॥॥)
గుట్టున నీ మేనిసొమ్ముగురుతు లడిగితేను
చుట్టి చుట్టి జూజాలు చూపేవు మాకు
గట్టువాయ వై మతకము లెంతసేసినాను
నెట్టన నీ పాటికి నేము భ్రమసేమా

(॥॥)
కూడితివి రతినేర్పు యాడ నేర్చితివంటేను
చూడఁ జూడఁ గళలంటి చొక్కించేవు
యీడనె శ్రీ వేంకటేశ యెన్ని వేసాలు సేసినా
జాడల నీసటలకు సమ్మతించేమా

(||pallavi||)
vīm̐pu gānarām̐gā dām̐gevidhamu nersugŏṁṭivi
mābudām̐kā niṁdulona maṟabunnadā

(||||)
sŏkkabunīvūrilonisuṭṭarigā laḍigide-
nĕkkaḍĕkkaḍo māḍalĕllā nāḍevu
pakkana nī vĕṁtesibarāgulu sesīnānu
makkaḽiṁchi māgiṁtalo marabayyīnā

(||||)
guṭṭuna nī menisŏmmugurudu laḍigidenu
suṭṭi suṭṭi jūjālu sūbevu māgu
gaṭṭuvāya vai madagamu lĕṁtasesinānu
nĕṭṭana nī pāḍigi nemu bhramasemā

(||||)
kūḍidivi radinerbu yāḍa nersidivaṁṭenu
sūḍam̐ jūḍam̐ gaḽalaṁṭi sŏkkiṁchevu
yīḍanĕ śhrī veṁkaḍeśha yĕnni vesālu sesinā
jāḍala nīsaḍalagu sammadiṁchemā