Veemdivo neeyeduda nunnaamdu vevelusamdaala nerajaanamdu

వీఁడివో నీయెదుట నున్నాఁడు వేవేలుచందాల నెరజాణఁడు
Language

(॥పల్లవి॥)
వీఁడివో నీయెదుట నున్నాఁడు వేవేలుచందాల నెరజాణఁడు
పోఁడిమితోడుతఁ గలకాలమును పొదిగి భోగించవే

(॥వీఁడి॥)
సేసపాల పెండ్లికూఁతురవు చినదానవటవే నీవు
మోసులువార నవ్వుచుఁ బతికి మోముచూపవే
నీసరివారిఁజూచి చేఁతలు నేరుచుకొనవే కడమలేల
ఆసలురేఁగ సరసమాడి ఆయములంటవే

(॥వీఁడి॥)
పోఁకలంతలుచన్నులదానవు బుద్దులు నేరుపవలెనా నీకు
యేఁకటవాయ మనసుఁగరఁచి యింపులు చల్లవే
వాఁకమైన జవ్వనపాయము వచ్చెను మతిలోఁదలఁచుకొనవే
తేఁకువతోడుత ముద్దుబలుకుల తేనెలు గురియవే

(॥వీఁడి॥)
చక్కఁదనముల చక్కెరబొమ్మవు చవులు చూపఁగవలెఁగదవే
గక్కన శ్రీవేంకటేశుఁడు గూడె కాఁపురము సేయవే
మిక్కుటమైన కలికితనాల మెరసి దిక్కులమెప్పించుకొనవే
వెక్కసముగను రతుల మెప్పించి వేడుక సేయవే

(||pallavi||)
vīm̐ḍivo nīyĕduḍa nunnām̐ḍu vevelusaṁdāla nĕrajāṇam̐ḍu
pom̐ḍimidoḍudam̐ galagālamunu pŏdigi bhogiṁchave

(||vīm̐ḍi||)
sesabāla pĕṁḍligūm̐turavu sinadānavaḍave nīvu
mosuluvāra navvusum̐ badigi momusūbave
nīsarivārim̐jūsi sem̐talu nerusugŏnave kaḍamalela
āsalurem̐ga sarasamāḍi āyamulaṁṭave

(||vīm̐ḍi||)
pom̐kalaṁtalusannuladānavu buddulu nerubavalĕnā nīgu
yem̐kaḍavāya manasum̐garam̐si yiṁpulu sallave
vām̐kamaina javvanabāyamu vachchĕnu madilom̐dalam̐sugŏnave
tem̐kuvadoḍuda muddubalugula tenĕlu guriyave

(||vīm̐ḍi||)
sakkam̐danamula sakkĕrabŏmmavu savulu sūbam̐gavalĕm̐gadave
gakkana śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ kām̐puramu seyave
mikkuḍamaina kaligidanāla mĕrasi dikkulamĕppiṁchugŏnave
vĕkkasamuganu radula mĕppiṁchi veḍuga seyave