వీదుల వీదుల నేఁగే విట్ట(ట్ఠ)లేశా । వట్టి
(॥పల్లవి॥)
వీదుల వీదుల నేఁగే విట్ట(ట్ఠ)లేశా । వట్టి-
వేదలెల్లాఁ బాసె నిఁక విట్టలేశా
(॥వీదు॥)
వేడుకకాఁడవైతివి విట్ఠలేశా నీకు
వీడె మందుకోవోయి విట్టలేశా
వీడు జోడునగవుల విట్టలేశా నీ పై
వేడెవెట్టె మావలపు విట్టలేశా
(॥వీదు॥)
వెలసె నీమోవి గడువిట్టలేశా నీకు
వెలుపలే లోనయ్య విట్టలేశా
వెలలేనిమహిమలవిట్టలేశా పూవు
విలుతునిఁ గన్న తండ్రి విట్టలేశా
(॥వీదు॥)
వెన్నెలతేటమాఁటలవిట్టలేశా నాఁ
విన్నపానకే కూడితి విట్టలేశా
వెన్నతో శ్రీవేంకటాద్రి విట్టలేశా నీవు
వెన్నుఁడవు వెయినామాలవిట్టలేశా
(||pallavi||)
vīdula vīdula nem̐ge viṭṭa(ṭṭha)leśhā | vaṭṭi-
vedalĕllām̐ bāsĕ nim̐ka viṭṭaleśhā
(||vīdu||)
veḍugagām̐ḍavaidivi viṭṭhaleśhā nīgu
vīḍĕ maṁdugovoyi viṭṭaleśhā
vīḍu joḍunagavula viṭṭaleśhā nī pai
veḍĕvĕṭṭĕ māvalabu viṭṭaleśhā
(||vīdu||)
vĕlasĕ nīmovi gaḍuviṭṭaleśhā nīgu
vĕlubale lonayya viṭṭaleśhā
vĕlalenimahimalaviṭṭaleśhā pūvu
viludunim̐ ganna taṁḍri viṭṭaleśhā
(||vīdu||)
vĕnnĕladeḍamām̐ṭalaviṭṭaleśhā nām̐
vinnabānage kūḍidi viṭṭaleśhā
vĕnnado śhrīveṁkaḍādri viṭṭaleśhā nīvu
vĕnnum̐ḍavu vĕyināmālaviṭṭaleśhā