Veedudodaaya valabu velamdigi neegunu

వీడుదోడాయ వలపు వెలఁదికి నీకును
Language

(॥పల్లవి॥)
వీడుదోడాయ వలపు వెలఁదికి నీకును
చూడఁ జూడ వేడుకాయ చూచువారికిని

(॥॥)
సిగ్గుతోడ బాగాలు చెలి నీకు నందియ్యఁ గా
వొగ్గుచు నందికొంటివి వొయ్యన నీవు
నిగ్గులు దేరే యట్టి నీ పుక్కిటితములము
అగ్గలపుమోహమున నాపెకుఁ బెట్టితివి

(॥॥)
చన్నులు బటువులుగ సతి నీకు నానించితే
వున్నతి నొరగుకొంటివి వొద్దికై నీవు
యెన్నికఁ జేతులు రెండు నీపెమేని కాదారుగ
చెన్నుమీర మెడదండనేసి కాఁగిలించితి

(॥॥)
పడఁతి నీకు దప్పికిఁ బన్నీ రందియ్యఁ గా
కడఁగి శ్రీవేంకటేశ కైకొంటివి
తడయక అధరామృతపుపానకము నేఁ డు
యెడనెడ మారుకుమారిచ్చితివి నీవు

(||pallavi||)
vīḍudoḍāya valabu vĕlam̐digi nīgunu
sūḍam̐ jūḍa veḍugāya sūsuvārigini

(||||)
siggudoḍa bāgālu sĕli nīgu naṁdiyyam̐ gā
vŏggusu naṁdigŏṁṭivi vŏyyana nīvu
niggulu dere yaṭṭi nī pukkiḍidamulamu
aggalabumohamuna nābĕgum̐ bĕṭṭidivi

(||||)
sannulu baḍuvuluga sadi nīgu nāniṁchide
vunnadi nŏragugŏṁṭivi vŏddigai nīvu
yĕnnigam̐ jedulu rĕṁḍu nībĕmeni kādāruga
sĕnnumīra mĕḍadaṁḍanesi kām̐giliṁchidi

(||||)
paḍam̐ti nīgu dappigim̐ bannī raṁdiyyam̐ gā
kaḍam̐gi śhrīveṁkaḍeśha kaigŏṁṭivi
taḍayaga adharāmṛtabubānagamu nem̐ ḍu
yĕḍanĕḍa mārugumārichchidivi nīvu