వీది వీది జెప్పఁగానే వింటిమి నేము
(॥పల్లవి॥)
వీది వీది జెప్పఁగానే వింటిమి నేము
కాదుగూడదననేల కంటిమిగా కొత్తలు
(॥వీది॥)
చెంగావి చూపులును సేమంతిపువ్వులును
యింగితానఁ జెలికబ్బె నేడవో కాని
అంగన నింతసేసినయతఁ డెంతజాణఁడో
ముంగిటఁ జూచినదాఁకా ముచ్చటయ్యీ మనసు
(॥వీది॥)
కప్పురపుమాటలను కస్తూరి వూర్పులు
యిప్పుడే కలిగె చెలి కేడవో కాని
దెప్పర మింతరేఁచిన దేవర యెంతటివాఁడో
తప్పక చూచినదాఁకా తమకించీఁ దనువు
(॥వీది॥)
ముత్తేల పులకులు ముంగారు చెమటలు
యిత్తలఁజెలికి నబ్బె నేడవో కాని
చిత్తగించి కూడినాఁడు శ్రీ వేంకటేశుఁడట
అత్తి నాకుఁ బొడచూపె ఆసగించీ గుణము
(||pallavi||)
vīdi vīdi jĕppam̐gāne viṁṭimi nemu
kādugūḍadananela kaṁṭimigā kŏttalu
(||vīdi||)
sĕṁgāvi sūbulunu semaṁtibuvvulunu
yiṁgidānam̐ jĕligabbĕ neḍavo kāni
aṁgana niṁtasesinayadam̐ ḍĕṁtajāṇam̐ḍo
muṁgiḍam̐ jūsinadām̐kā muchchaḍayyī manasu
(||vīdi||)
kappurabumāḍalanu kastūri vūrbulu
yippuḍe kaligĕ sĕli keḍavo kāni
dĕppara miṁtarem̐sina devara yĕṁtaḍivām̐ḍo
tappaga sūsinadām̐kā tamagiṁchīm̐ danuvu
(||vīdi||)
muttela pulagulu muṁgāru sĕmaḍalu
yittalam̐jĕligi nabbĕ neḍavo kāni
sittagiṁchi kūḍinām̐ḍu śhrī veṁkaḍeśhum̐ḍaḍa
atti nāgum̐ bŏḍasūbĕ āsagiṁchī guṇamu