Veedemu sedam battuga veemde vunnaamdu

వీడెము చేతఁ బట్టుక వీఁడె వున్నాఁడు
Language

(॥పల్లవి॥)
వీడెము చేతఁ బట్టుక వీఁడె వున్నాఁడు
తోడఁ దోడ బైకొని దోసిలొగ్గఁ గదవే

(॥॥)
మాఁటఁల దేనెలు గారీ మాఁటిమాఁటికిని నీకు
కాటుక కన్నులచూపే కాఁడి పారీని
తాటించి విభునితోడ దారా మోనా జూపితివి
యేఁటికి జాగులుసేసే విఁక నియ్యకొనవే

(॥॥)
నిలువెల్ల వినయమే నిండాఁ గొనలు సాగీ
బలిమెల్లఁ జన్నులనే పౌఁజు చూపీని
నెలకొని యీతనిపై నీడా నెండాఁ గాసితివి
చలము లింకనేఁటికి సమ్మతించఁగదవే

(॥॥)
చేరి సేసలు వెట్టితే చిరుముత్యాలు గారీని
గోరికొన గీరితేను యేరు వారీని
యీరీతి శ్రీవేంకటేశు కింపూ సొంపూఁ జూపితివి
ఆరయ నిఁక నేఁటికి అట్టే మెచ్చఁగదవే

(||pallavi||)
vīḍĕmu sedam̐ baṭṭuga vīm̐ḍĕ vunnām̐ḍu
toḍam̐ doḍa baigŏni dosilŏggam̐ gadave

(||||)
mām̐ṭam̐la denĕlu gārī mām̐ṭimām̐ṭigini nīgu
kāḍuga kannulasūbe kām̐ḍi pārīni
tāḍiṁchi vibhunidoḍa dārā monā jūbidivi
yem̐ṭigi jāgulusese vim̐ka niyyagŏnave

(||||)
niluvĕlla vinayame niṁḍām̐ gŏnalu sāgī
balimĕllam̐ jannulane paum̐ju sūbīni
nĕlagŏni yīdanibai nīḍā nĕṁḍām̐ gāsidivi
salamu liṁkanem̐ṭigi sammadiṁcham̐gadave

(||||)
seri sesalu vĕṭṭide sirumutyālu gārīni
gorigŏna gīridenu yeru vārīni
yīrīdi śhrīveṁkaḍeśhu kiṁpū sŏṁpūm̐ jūbidivi
āraya nim̐ka nem̐ṭigi aṭṭe mĕchcham̐gadave