Veedemittuvu raavammaa veemde paanububai nunnaamdu

వీడెమిత్తువు రావమ్మా వీఁడె పానుపుపై నున్నాఁడు
Language

(॥పల్లవి॥)
వీడెమిత్తువు రావమ్మా వీఁడె పానుపుపై నున్నాఁడు
జోడైన వయసులే సొంపులు వుట్టించీని

(॥॥)
సొలసి నీవుచూచినచూపులెల్లాఁ బతికిని
కలువపూవుదండలై కమ్ముకొనెను
నెలఁ త నీవు చక్కనినెమ్మోము చూపితేను
వలుదచంద్రబింబమై వలపులు రేఁచెను

(॥॥)
అరిది నాతనితోడ నాడిన మెల్లనిమాట
తరితీపుతేనెలై దైలువారెను
సరుగ నీవప్పుడు సన్న నేసిన సన్న
సురతపులతలై చుట్టుకొనెను

(॥॥)
యెనసి శ్రీవెంకటేశుయెదుట నవ్విననవ్వు
చెనకి పైఁ జల్లినసేస లాయను
పెనఁ గి చేతులువట్టి పిలిచినపిలుపులు
తనివోనికంకణదారా లాయను

(||pallavi||)
vīḍĕmittuvu rāvammā vīm̐ḍĕ pānububai nunnām̐ḍu
joḍaina vayasule sŏṁpulu vuṭṭiṁchīni

(||||)
sŏlasi nīvusūsinasūbulĕllām̐ badigini
kaluvabūvudaṁḍalai kammugŏnĕnu
nĕlam̐ ta nīvu sakkaninĕmmomu sūbidenu
valudasaṁdrabiṁbamai valabulu rem̐sĕnu

(||||)
aridi nādanidoḍa nāḍina mĕllanimāḍa
taridībudenĕlai dailuvārĕnu
saruga nīvappuḍu sanna nesina sanna
suradabuladalai suṭṭugŏnĕnu

(||||)
yĕnasi śhrīvĕṁkaḍeśhuyĕduḍa navvinanavvu
sĕnagi paim̐ jallinasesa lāyanu
pĕnam̐ gi seduluvaṭṭi pilisinabilubulu
tanivonigaṁkaṇadārā lāyanu