వీడె మియ్యఁ గదవె విభునికిని
(॥పల్లవి॥)
వీడె మియ్యఁ గదవె విభునికిని
జోడుగూడిన వలపు సోదించ నేఁటికే
(॥వీడె॥)
చెప్పినట్టె సేసితేను చేతికి లోనౌఁ బతి
తప్పక కొలిచితేను దయదలఁచును
చిప్పిలఁగ నాతఁడు యేచెలులతో నవ్వినాను
వుప్పింతించ రాదు మరి వొడ్డారించరాదు
(॥వీడె॥)
వచ్చినట్టె వచ్చితేను వసమౌను నాయకుఁడు
యిచ్చలోనే మెలఁగితే నింపు వుట్టును
వచ్చిగా వేరొకతెపై పరాకై యాతఁడుండితే
తచ్చి తచ్చి దూరరాదు తమకించరాదు
(॥వీడె॥)
గారవించి వేఁడుకొంటే కాఁగిలించు రమణుఁడు
సారె సేవలు సేసితేఁ జన విచ్చును
యీరీతి శ్రీవేంకటేశుఁడిందులకే నిన్నుఁగూడె
వేరు శాయరా దిఁక వేగిరించరాదు
(||pallavi||)
vīḍĕ miyyam̐ gadavĕ vibhunigini
joḍugūḍina valabu sodiṁcha nem̐ṭige
(||vīḍĕ||)
sĕppinaṭṭĕ sesidenu sedigi lonaum̐ badi
tappaga kŏlisidenu dayadalam̐sunu
sippilam̐ga nādam̐ḍu yesĕlulado navvinānu
vuppiṁtiṁcha rādu mari vŏḍḍāriṁcharādu
(||vīḍĕ||)
vachchinaṭṭĕ vachchidenu vasamaunu nāyagum̐ḍu
yichchalone mĕlam̐gide niṁpu vuṭṭunu
vachchigā verŏgadĕbai parāgai yādam̐ḍuṁḍide
tachchi tachchi dūrarādu tamagiṁcharādu
(||vīḍĕ||)
gāraviṁchi vem̐ḍugŏṁṭe kām̐giliṁchu ramaṇum̐ḍu
sārĕ sevalu sesidem̐ jana vichchunu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍiṁdulage ninnum̐gūḍĕ
veru śhāyarā dim̐ka vegiriṁcharādu