Vedugonavayya aabe veda deeranu

వేడుకొనవయ్య ఆపె వెత దీరను
Language

(॥పల్లవి॥)
వేడుకొనవయ్య ఆపె వెత దీరను
పోడిమి నాడినమాట బొంకవు గదా

(॥వేడు॥)
శిరసు వంచుకొన్నది చెక్కుచేతితో నున్నది
తరుణి కిచ్చినబాస దప్పవు గదా
మరిగి కూచున్నది మారుమాటాడ కున్నది
వొరసి కొనగోర వూఁదవు గదా

(॥వేడు॥)
బొమ్మ ముడితో నున్నది పొరపొచ్చాన నున్నది
చిమ్ముచు నాపెతో మేకు సేయవుగదా
సమ్మతించక వున్నది చలముతోడ నున్నది
యెమ్మెలకు సవతుల నెంచి చూపవు గదా

(॥వేడు॥)
చేతుల మొక్కుచున్నది సెలవి నవ్వుచున్నది
యీతల రతుల నలయించవు గదా
గాతల శ్రీవేంకటేశ కడుఁ గొసరుచున్నది
రేతిరిఁ బగలు తమి రేఁచవు గదా

(||pallavi||)
veḍugŏnavayya ābĕ vĕda dīranu
poḍimi nāḍinamāḍa bŏṁkavu gadā

(||veḍu||)
śhirasu vaṁchugŏnnadi sĕkkusedido nunnadi
taruṇi kichchinabāsa dappavu gadā
marigi kūsunnadi mārumāḍāḍa kunnadi
vŏrasi kŏnagora vūm̐davu gadā

(||veḍu||)
bŏmma muḍido nunnadi pŏrabŏchchāna nunnadi
simmusu nābĕdo megu seyavugadā
sammadiṁchaga vunnadi salamudoḍa nunnadi
yĕmmĕlagu savadula nĕṁchi sūbavu gadā

(||veḍu||)
sedula mŏkkusunnadi sĕlavi navvusunnadi
yīdala radula nalayiṁchavu gadā
gādala śhrīveṁkaḍeśha kaḍum̐ gŏsarusunnadi
redirim̐ bagalu tami rem̐savu gadā