వేడుకయ్యీ నాకు నేఁడు వెరవ మీకేఁటికి
(॥పల్లవి॥)
వేడుకయ్యీ నాకు నేఁడు వెరవ మీకేఁటికి
కూడుక వుండఁగరాదా గుట్టు దెలిసేను
(॥॥)
అద్దమరేతిరి నీవు ఆపెతో మాటలాడఁగా
వొద్దికి నే వచ్చితేనే వూరకుంటిరి
వద్దనేనా నే మిమ్ము వలపుగలంత మీలో
సుద్దులు చెప్పకోరాదా సొరిది నే వినేను
(॥॥)
అంకెలుగా సన్నలు మీరట్టె సేసుకోఁగా నే మీ-
వంక చూచితే తల వంచుకొంటిరి
కొంకనేల నాయడకు కోరినట్టెల్లా మీకు
పొంకము లెంచుకోరాదా పొసఁగ నే మెచ్చేను
(॥॥)
కందువ మీరిద్దరును కాఁగిటిలో నవ్వుకోఁగా
సందడిలో నే మొక్కితే జట్టిగొంటిరి
అందుకేమి శ్రీవేంకటాధిప నన్నేలితివి
పందేలు వేసుకోరాదా బలిమి నే చూచేను
(||pallavi||)
veḍugayyī nāgu nem̐ḍu vĕrava mīgem̐ṭigi
kūḍuga vuṁḍam̐garādā guṭṭu dĕlisenu
(||||)
addamarediri nīvu ābĕdo māḍalāḍam̐gā
vŏddigi ne vachchidene vūraguṁṭiri
vaddanenā ne mimmu valabugalaṁta mīlo
suddulu sĕppagorādā sŏridi ne vinenu
(||||)
aṁkĕlugā sannalu mīraṭṭĕ sesugom̐gā ne mī-
vaṁka sūside tala vaṁchugŏṁṭiri
kŏṁkanela nāyaḍagu korinaṭṭĕllā mīgu
pŏṁkamu lĕṁchugorādā pŏsam̐ga ne mĕchchenu
(||||)
kaṁduva mīriddarunu kām̐giḍilo navvugom̐gā
saṁdaḍilo ne mŏkkide jaṭṭigŏṁṭiri
aṁdugemi śhrīveṁkaḍādhiba nannelidivi
paṁdelu vesugorādā balimi ne sūsenu