వేడుకలింతేకాని వెంగెము గాదు
(॥పల్లవి॥)
వేడుకలింతేకాని వెంగెము గాదు
జోడుగూడ నందులోని సొంపులు సుమ్మీ
(॥వేడుక॥)
సెలవులనే నవ్వఁగా చిత్తము నీకెట్టుండెనో
వలపులలోపలి వాడికె సుమ్మీ
కల చెప్పఁగాఁ దారుకాణలెందు మోచెనో
తలఁపుల లోపలి తమకము సుమ్మీ
(॥వేడుక॥)
నెట్టుకొని చూడఁగాను నీవేమని యంటివో
అట్టే పాయఁగరాని ఆసలు సుమ్మీ
పట్టి పెనఁగఁగా నీపంతములేడ వీఁగెనో
చిట్టికపు చేఁతలలో సిగ్గులు సుమ్మీ
(॥వేడుక॥)
చన్నుల నేనొత్తఁగాను చలములెంత రేఁగెనో
కన్నెపాయములోపలి గాతలు సుమ్మీ
మిన్నక శ్రీవేంకటేశ మెచ్చితేఁ జేఁగలమఱ్ఱి
చెన్నుఁడవై యేలితివి సేవ నాది సుమ్మీ
(||pallavi||)
veḍugaliṁtegāni vĕṁgĕmu gādu
joḍugūḍa naṁduloni sŏṁpulu summī
(||veḍuga||)
sĕlavulane navvam̐gā sittamu nīgĕṭṭuṁḍĕno
valabulalobali vāḍigĕ summī
kala sĕppam̐gām̐ dārugāṇalĕṁdu mosĕno
talam̐pula lobali tamagamu summī
(||veḍuga||)
nĕṭṭugŏni sūḍam̐gānu nīvemani yaṁṭivo
aṭṭe pāyam̐garāni āsalu summī
paṭṭi pĕnam̐gam̐gā nībaṁtamuleḍa vīm̐gĕno
siṭṭigabu sem̐talalo siggulu summī
(||veḍuga||)
sannula nenŏttam̐gānu salamulĕṁta rem̐gĕno
kannĕbāyamulobali gādalu summī
minnaga śhrīveṁkaḍeśha mĕchchidem̐ jem̐galamaṭri
sĕnnum̐ḍavai yelidivi seva nādi summī