వేడుకలెటువంటివో వెలఁదిఁ జూడఁగరాదా
(॥పల్లవి॥)
వేడుకలెటువంటివో వెలఁదిఁ జూడఁగరాదా
జాడతోడ వలపులు సందడించఁ జొచ్చెను
(॥వేడుక॥)
సెలవుల నగవులు శిరసుపై తలఁబాలు
వొలుకుచు నున్నవొక్కమాఁటే
మొలకచన్నుల కాంతి మొక్కుల వినయములు
వులివచ్చిగాఁ జూపె నొక్కమాఁటే
(॥వేడుక॥)
చిప్పిలు మోవిముద్దులు చెక్కులచెమటలును
ఉప్పతిల్లఁ గురియించీ నొక్కమాటే
ముప్పిరిగొన్న సిగ్గులు ముయ్యీడు పులకలతో
వొప్పులెల్లా నెరపీని వొక్కమాఁటే
(॥వేడుక॥)
తొరలింపు మాటలును దొంతుల సరసములు
వొరిమతోఁ బచరించీ నొక్కమాఁటే
యిరవై శ్రీవేంకటేశ యింతి నిట్టే కలసితి
వురవడి నొరసేవు వొక్కమాఁటే
(||pallavi||)
veḍugalĕḍuvaṁṭivo vĕlam̐dim̐ jūḍam̐garādā
jāḍadoḍa valabulu saṁdaḍiṁcham̐ jŏchchĕnu
(||veḍuga||)
sĕlavula nagavulu śhirasubai talam̐bālu
vŏlugusu nunnavŏkkamām̐ṭe
mŏlagasannula kāṁti mŏkkula vinayamulu
vulivachchigām̐ jūbĕ nŏkkamām̐ṭe
(||veḍuga||)
sippilu movimuddulu sĕkkulasĕmaḍalunu
uppadillam̐ guriyiṁchī nŏkkamāḍe
muppirigŏnna siggulu muyyīḍu pulagalado
vŏppulĕllā nĕrabīni vŏkkamām̐ṭe
(||veḍuga||)
tŏraliṁpu māḍalunu dŏṁtula sarasamulu
vŏrimadom̐ basariṁchī nŏkkamām̐ṭe
yiravai śhrīveṁkaḍeśha yiṁti niṭṭe kalasidi
vuravaḍi nŏrasevu vŏkkamām̐ṭe