Vedugale meemda meemda velayumgaaga

వేడుకలే మీఁద మీఁద వెలయుఁగాక
Language

(॥పల్లవి॥)
వేడుకలే మీఁద మీఁద వెలయుఁగాక
జోడై మీరిద్ద రొక్కచోటనే వుండఁగాను

(॥వేడు॥)
వెన్నలకెక్క డి వేఁడి విరుల కెక్కడి వాఁడి
కన్నెక విభుఁడు నీవు గలకాలము
సన్నలేల మొగచాటౌ చప్పనేలౌ మోవితేనె
యెన్నికతో నేపొద్దు నీవెదుట నుండఁగాను

(॥వేడు॥)
చిత్తమున కేడ చింత సిగ్గులకు నేడ వంత
హత్తి నీ వీపె కాఁగిట నలరఁగాను
బత్తియేల విరసమౌ పాయమెట్టు పట్టవచ్చు
కొత్తలుగా నీ వీ రీతిఁ కొమ్మతో నవ్వఁగాను

(॥వేడు॥)
వలపులకేది మితి వాసులకు నేది తతి
చెలిమి మీరిద్దరునుఁ జేయఁగాను
అలమేల్మంగ నేలితి వపుడె శ్రీవేంకటేశ
చెలి యాల మరచు నీచేఁతలు మించఁగాను

(||pallavi||)
veḍugale mīm̐da mīm̐da vĕlayum̐gāga
joḍai mīridda rŏkkasoḍane vuṁḍam̐gānu

(||veḍu||)
vĕnnalagĕkka ḍi vem̐ḍi virula kĕkkaḍi vām̐ḍi
kannĕga vibhum̐ḍu nīvu galagālamu
sannalela mŏgasāḍau sappanelau movidenĕ
yĕnnigado nebŏddu nīvĕduḍa nuṁḍam̐gānu

(||veḍu||)
sittamuna keḍa siṁta siggulagu neḍa vaṁta
hatti nī vībĕ kām̐giḍa nalaram̐gānu
battiyela virasamau pāyamĕṭṭu paṭṭavachchu
kŏttalugā nī vī rīdim̐ kŏmmado navvam̐gānu

(||veḍu||)
valabulagedi midi vāsulagu nedi tadi
sĕlimi mīriddarunum̐ jeyam̐gānu
alamelmaṁga nelidi vabuḍĕ śhrīveṁkaḍeśha
sĕli yāla marasu nīsem̐talu miṁcham̐gānu