Vedugaide maa yimdlagu vichcheyavayyaa

వేడుకైతే మా యిండ్లకు విచ్చేయవయ్యా
Language

(॥పల్లవి॥)
వేడుకైతే మా యిండ్లకు విచ్చేయవయ్యా
యీడ నేమి యడిగేవు యివిగో మా సుద్దులు

(॥వేడు॥)
మోవరానిమోపులు మునుకొన్నవలపులు
పూవకపూచేపూవులు పూఁవనవ్వులు
చేవలోనిచేఁగలు చెప్పరానివయసులు
యీవల నేమడిగేవు ఇవిగో మాసుద్దులు

(॥వేడు॥)
పట్టరానిపదనులు పంతపుమావాసులు
చెట్టులపై చిగురులు చిమ్ముఁజూపులు
వుట్టులపైతేనెలు వుడివోనిమామాటలు
యిట్టె యేమడిగేవు ఇదిగో మాసుద్దులు

(॥వేడు॥)
వెన్నెలలోపులుఁగాలు వెక్కసపుమాసిగ్గులు
కిన్నెరమీఁటులు గిలిగింతరతులు
ఇన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ముఁదొల్లె
యెన్నెని యడిగేవయ్యా ఇదిగో మాసుద్దులు

(||pallavi||)
veḍugaide mā yiṁḍlagu vichcheyavayyā
yīḍa nemi yaḍigevu yivigo mā suddulu

(||veḍu||)
movarānimobulu munugŏnnavalabulu
pūvagabūsebūvulu pūm̐vanavvulu
sevalonisem̐galu sĕpparānivayasulu
yīvala nemaḍigevu ivigo māsuddulu

(||veḍu||)
paṭṭarānibadanulu paṁtabumāvāsulu
sĕṭṭulabai sigurulu simmum̐jūbulu
vuṭṭulabaidenĕlu vuḍivonimāmāḍalu
yiṭṭĕ yemaḍigevu idigo māsuddulu

(||veḍu||)
vĕnnĕlalobulum̐gālu vĕkkasabumāsiggulu
kinnĕramīm̐ṭulu giligiṁtaradulu
inniḍā śhrīveṁkaḍeśha yelidivi mammum̐dŏllĕ
yĕnnĕni yaḍigevayyā idigo māsuddulu