Vedugagu velaledu vibhunido nanaraadu

వేడుకకు వెలలేదు విభునితో ననరాదు
Language

(॥పల్లవి॥)
వేడుకకు వెలలేదు విభునితో ననరాదు
సూడిదెవంటి వలపు సులభాననే

(॥వేడు॥)
తఱఁగు మొరఁగుమాట తలఁపులోపలితీఁట
తఱితో నాయందునుంటేఁ దనకేమే
కఱకరిఁ బెట్టఁబోతే కలిముదిరి మెడిదె
యెఱుక సేసుకోరాదు యేమందునే

(॥వేడు॥)
గుట్టుతో నవ్విననవ్వు కొప్పులోపలిపువ్వు
యెట్టువలసినా వచ్చు నేమనీనే
ముట్టినదెల్లా ముయి పట్టినదెల్లా బంగారు
ఱట్టు సేయరాదు మేలాఱడి కెక్కెనే

(॥వేడు॥)
కన్నుల మొక్కిన మొక్కు కాఁగిటఁ గూడిన చొక్కు
చన్నుబంటేయ నిఁక సాదించ నేలే
యిన్నిటా శ్రీవేంకటేశ్వరుఁ డింతలోతానన్నుఁగూడె
పిన్ననాఁడే సేసవెట్ట బిగియ నేలే

(||pallavi||)
veḍugagu vĕlaledu vibhunido nanarādu
sūḍidĕvaṁṭi valabu sulabhānane

(||veḍu||)
taṟam̐gu mŏram̐gumāḍa talam̐pulobalidīm̐ṭa
taṟido nāyaṁdunuṁṭem̐ danageme
kaṟagarim̐ bĕṭṭam̐bode kalimudiri mĕḍidĕ
yĕṟuga sesugorādu yemaṁdune

(||veḍu||)
guṭṭudo navvinanavvu kŏppulobalibuvvu
yĕṭṭuvalasinā vachchu nemanīne
muṭṭinadĕllā muyi paṭṭinadĕllā baṁgāru
ṟaṭṭu seyarādu melāṟaḍi kĕkkĕne

(||veḍu||)
kannula mŏkkina mŏkku kām̐giḍam̐ gūḍina sŏkku
sannubaṁṭeya nim̐ka sādiṁcha nele
yinniḍā śhrīveṁkaḍeśhvarum̐ ḍiṁtalodānannum̐gūḍĕ
pinnanām̐ḍe sesavĕṭṭa bigiya nele