వేడుకకు వెలలేదు విభుఁడ వాకెకును
(॥పల్లవి॥)
వేడుకకు వెలలేదు విభుఁడ వాకెకును
జాడలెల్ల సరివచ్చె సమ్మతాయ మాకును
(॥॥)
తచ్చితచ్చి మాటలలోఁ దనవల పఁతయును
యెచ్చరించెఁగా నేఁడు యింతి నీకు
పచ్చిచేఁతలనే నీతోఁ బచరించవచ్చెఁగా ననుపు
యిచ్చకముగాఁ బొంచి యిందరిలోన
(॥॥)
సెలవినవ్వులలోనే చేసేటివిన్నపాల్లెలా
తలఁపించెగా నేఁడు తరుణి నీకు
పిలిచేనేరుపులోనే బెరయించెఁగా పగటు
నలువై నీమెచ్చుగాను నడుమఁ దాను
(॥॥)
కూడిన కాఁగిటిలోనే గురుతైనకాఁపురాలు
యీడేరఁ జేసెఁగా యీసతి నీకు
జోడై శ్రీవేంకటేశ చొక్కి నన్ను నేలితివి
వీడెమిచ్చెఁగా మఱియు వింతలేక యిపుడు
(||pallavi||)
veḍugagu vĕlaledu vibhum̐ḍa vāgĕgunu
jāḍalĕlla sarivachchĕ sammadāya māgunu
(||||)
tachchidachchi māḍalalom̐ danavala pam̐tayunu
yĕchchariṁchĕm̐gā nem̐ḍu yiṁti nīgu
pachchisem̐talane nīdom̐ basariṁchavachchĕm̐gā nanubu
yichchagamugām̐ bŏṁchi yiṁdarilona
(||||)
sĕlavinavvulalone seseḍivinnabāllĕlā
talam̐piṁchĕgā nem̐ḍu taruṇi nīgu
pilisenerubulone bĕrayiṁchĕm̐gā pagaḍu
naluvai nīmĕchchugānu naḍumam̐ dānu
(||||)
kūḍina kām̐giḍilone gurudainagām̐purālu
yīḍeram̐ jesĕm̐gā yīsadi nīgu
joḍai śhrīveṁkaḍeśha sŏkki nannu nelidivi
vīḍĕmichchĕm̐gā maṟiyu viṁtalega yibuḍu