వేడుకగలట్టెల్లాను వినోదింతువుగాక
(॥పల్లవి॥)
వేడుకగలట్టెల్లాను వినోదింతువుగాక
యీడు జోడై వుండి మరి యెరవు లేమిటికే
(॥వేడు॥)
కనుఁగొనవలెనంటే కనురెప్ప లలసీనా
జునుఁగ కితని మోము చూతువుగాక
పెనచి మాఁటడితేను పెదవు లరగీనా
మనసు వచ్చినట్టెల్లా మాఁటలాడఁగదవే
(॥వేడు॥)
చిన్ని నవ్వు నవ్వితేను సెలవులు వేసరీనా
యిన్నిటా నీ నేర్పు మెరయింతువుగాక
సన్నసేసితే రతుల చవులు దరగీనా
వున్నతి నీ కొనగోర నొరయఁగఁగదవే
(॥వేడు॥)
కదిసితే కాఁగిటిలో గట్టిచన్నులు గందీనా
గుదిగొన నితనిఁ గూడుదుగాక
చెదరక నిను నేలె శ్రీవేంకటేశుఁ డితఁడు
వదలీనా తురు మిఁక వంచి మొక్కఁగదవే
(||pallavi||)
veḍugagalaṭṭĕllānu vinodiṁtuvugāga
yīḍu joḍai vuṁḍi mari yĕravu lemiḍige
(||veḍu||)
kanum̐gŏnavalĕnaṁṭe kanurĕppa lalasīnā
junum̐ga kidani momu sūduvugāga
pĕnasi mām̐ṭaḍidenu pĕdavu laragīnā
manasu vachchinaṭṭĕllā mām̐ṭalāḍam̐gadave
(||veḍu||)
sinni navvu navvidenu sĕlavulu vesarīnā
yinniḍā nī nerbu mĕrayiṁtuvugāga
sannaseside radula savulu daragīnā
vunnadi nī kŏnagora nŏrayam̐gam̐gadave
(||veḍu||)
kadiside kām̐giḍilo gaṭṭisannulu gaṁdīnā
gudigŏna nidanim̐ gūḍudugāga
sĕdaraga ninu nelĕ śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu
vadalīnā turu mim̐ka vaṁchi mŏkkam̐gadave