Vedugagaamdu gadamma vitthaleshumdu

వేడుకకాఁడు గదమ్మ విట్ఠలేశుఁడు
Language

(॥పల్లవి॥)
వేడుకకాఁడు గదమ్మ విట్ఠలేశుఁడు
వేడెమియ్య వచ్చీని విట్ఠలేశుఁడు

(॥వేడు॥)
సరుస రుక్మిణిదేవి సత్యభామయుఁ జెనక
వెరవులు వెదకీని విట్ఠలేశుఁడు
సరసములాడుకొంటా సారెకు వలపులు చల్లీ
విరుల దండలతోడి విట్ఠలేశుఁడు

(॥వేడు॥)
చన్నులంటి గోపికల సన్నలఁ దిట్లు దిట్టీ
వెన్నదిన్ననోరితోడి విట్ఠలేశుఁడు
కన్నులఁదప్పక చూచి కలువపువ్వుల వేసీ
వెన్నెలనవ్వులతోడి విట్ఠలేశుఁడు

(॥వేడు॥)
అగడపుఁజేత సేసి ఆయములుసోఁకఁ గూడె
వేగిరకాఁడు గదవే విట్ఠలేశుఁడు
బాగుగ శ్రీవేంకటాద్రిఁ బాయక నన్నేలి మెచ్చీ
వేగ జాముననుండి విట్ఠలేశుఁడు

(||pallavi||)
veḍugagām̐ḍu gadamma viṭṭhaleśhum̐ḍu
veḍĕmiyya vachchīni viṭṭhaleśhum̐ḍu

(||veḍu||)
sarusa rukmiṇidevi satyabhāmayum̐ jĕnaga
vĕravulu vĕdagīni viṭṭhaleśhum̐ḍu
sarasamulāḍugŏṁṭā sārĕgu valabulu sallī
virula daṁḍaladoḍi viṭṭhaleśhum̐ḍu

(||veḍu||)
sannulaṁṭi gobigala sannalam̐ diṭlu diṭṭī
vĕnnadinnanoridoḍi viṭṭhaleśhum̐ḍu
kannulam̐dappaga sūsi kaluvabuvvula vesī
vĕnnĕlanavvuladoḍi viṭṭhaleśhum̐ḍu

(||veḍu||)
agaḍabum̐jeda sesi āyamulusom̐kam̐ gūḍĕ
vegiragām̐ḍu gadave viṭṭhaleśhum̐ḍu
bāguga śhrīveṁkaḍādrim̐ bāyaga nanneli mĕchchī
vega jāmunanuṁḍi viṭṭhaleśhum̐ḍu