వేడుకకాఁడు గదమ్మ విట్టలుఁడు
(॥పల్లవి॥)
వేడుకకాఁడు గదమ్మ విట్టలుఁడు
ఆడా నీడా నేగి వచ్చీ నదె విట్టలుఁడు
(॥వేడుక॥)
తుంగభద్రనీటిలోన తొయ్యలులుఁ దాను నీఁదీ
వెంగలిరతులఁ దోఁగీ విట్టలుఁడు
నింగి మోచినతోపులనీడల వినోదించి
నంగనలతో నవ్వుచు నదే విట్టలుఁడు
(॥వేడుక॥)
తేరువీది నల్ల వాఁడే దిమ్మరై సతులఁ బిల్చి
వే రమ్మనీ చీఁకటింట్లో విట్టలుఁడు
కూరిమి నిలుపలేక కొండలపడవలలో
నారగించీ నూరవిందు లదే విట్టలుఁడు
(॥వేడుక॥)
అదివో విజనగరమందు వాడల వాడల
వెదచల్లీ వరములు విట్టలుఁడు
ఉదుటు శ్రీవేంకటాద్రినుండి వచ్చి గుడిలోన
నదన రుక్మిణి దాను నదే విట్టలుఁడు
(||pallavi||)
veḍugagām̐ḍu gadamma viṭṭalum̐ḍu
āḍā nīḍā negi vachchī nadĕ viṭṭalum̐ḍu
(||veḍuga||)
tuṁgabhadranīḍilona tŏyyalulum̐ dānu nīm̐dī
vĕṁgaliradulam̐ dom̐gī viṭṭalum̐ḍu
niṁgi mosinadobulanīḍala vinodiṁchi
naṁganalado navvusu nade viṭṭalum̐ḍu
(||veḍuga||)
teruvīdi nalla vām̐ḍe dimmarai sadulam̐ bilsi
ve rammanī sīm̐kaḍiṁṭlo viṭṭalum̐ḍu
kūrimi nilubalega kŏṁḍalabaḍavalalo
nāragiṁchī nūraviṁdu lade viṭṭalum̐ḍu
(||veḍuga||)
adivo vijanagaramaṁdu vāḍala vāḍala
vĕdasallī varamulu viṭṭalum̐ḍu
uduḍu śhrīveṁkaḍādrinuṁḍi vachchi guḍilona
nadana rukmiṇi dānu nade viṭṭalum̐ḍu