వేడుకకాఁడు గదమ్మ విజనగరములోన
(॥పల్లవి॥)
వేడుకకాఁడు గదమ్మ విజనగరములోన
వేడె వెట్టీ సతులను వెన్నముద్దకృష్ణుఁడు
(॥వేడు॥)
ఇంటిలో నామగఁడు నేనిద్దరమునున్న వేళ
వొంటినే తాఁ జొచ్చి వచ్చీనోయమ్మలాల
దంట తనమున నేను తనకన్నులు మూసితే
చంటికి చేతులు చాఁచీ జాణఁడే యీకృష్ణుఁడు
(॥వేడు॥)
కమ్మర మాయాతఁడు నేఁ గాఁగిలించుకుండఁగాను
వుమ్మడిఁ దా మోవియిచ్చీనోయమ్మలాల
చిమ్ముచు నేనంతలోన సిగ్గుపడితే నాపక్కఁ
నిమ్ముసేసుకొని పండీనిదివో యీకృష్ణుఁడు
(॥వేడు॥)
పేరుకొని నావిభునిఁ బిలిచితేనూఁకొని
వూరకె తా వచ్చికూడె నోయమ్మలాల
యీరీతి శ్రీవేంకటాద్రినిరవై యీడా నాడ
కూరిములు వెదచల్లీ గోపాలకృష్ణుఁడు
(||pallavi||)
veḍugagām̐ḍu gadamma vijanagaramulona
veḍĕ vĕṭṭī sadulanu vĕnnamuddakṛṣhṇum̐ḍu
(||veḍu||)
iṁṭilo nāmagam̐ḍu neniddaramununna veḽa
vŏṁṭine tām̐ jŏchchi vachchīnoyammalāla
daṁṭa tanamuna nenu tanagannulu mūside
saṁṭigi sedulu sām̐sī jāṇam̐ḍe yīkṛṣhṇum̐ḍu
(||veḍu||)
kammara māyādam̐ḍu nem̐ gām̐giliṁchuguṁḍam̐gānu
vummaḍim̐ dā moviyichchīnoyammalāla
simmusu nenaṁtalona siggubaḍide nābakkam̐
nimmusesugŏni paṁḍīnidivo yīkṛṣhṇum̐ḍu
(||veḍu||)
perugŏni nāvibhunim̐ bilisidenūm̐kŏni
vūragĕ tā vachchigūḍĕ noyammalāla
yīrīdi śhrīveṁkaḍādriniravai yīḍā nāḍa
kūrimulu vĕdasallī gobālakṛṣhṇum̐ḍu