Vedugagaamdavu neegu verabemtigi

వేడుకకాఁడవు నీకు వెరపేఁటికి
Language

(॥పల్లవి॥)
వేడుకకాఁడవు నీకు వెరపేఁటికి
యీడువెట్టి నీ సుద్దుల కేమీ ననమయ్యా

(॥వేడు॥)
ఇంటిలోన నాకె మాట యేమని చెప్పెనో నీకు
వెంటవెంట వచ్చి నన్ను వేఁడుకొనేవు
దంటయైనవాఁడవు దైన్నమేటికిఁ నీకు
గొంటు నీసుద్దు లెవ్వతెకునుఁ జెప్పవయ్యా

(॥వేడు॥)
సరుగున నాకె యేమి సన్నసేసెనో నీకు
అరుదుగా నన్నుఁ గడు నాదరించేవు
బిరుదుగలవాండవు ప్రియము చెప్పంగనేల
యెరవుల నీసుద్దు లేడాం దడవమయ్యా

(॥వేడు॥)
ఇప్పు డిట్టె యాపె గుణమేమి నేర్పెనో నీకు
కుప్పళింపు జెమటతోఁ గూడితి నన్ను
వొప్పి శ్రీవేంకటేశుడ వొడ్డుకోనేటిఁకి నీకు
కప్పి నీసుద్దులు నే మగడు సేయమయ్యా

(||pallavi||)
veḍugagām̐ḍavu nīgu vĕrabem̐ṭigi
yīḍuvĕṭṭi nī suddula kemī nanamayyā

(||veḍu||)
iṁṭilona nāgĕ māḍa yemani sĕppĕno nīgu
vĕṁṭavĕṁṭa vachchi nannu vem̐ḍugŏnevu
daṁṭayainavām̐ḍavu dainnameḍigim̐ nīgu
gŏṁṭu nīsuddu lĕvvadĕgunum̐ jĕppavayyā

(||veḍu||)
saruguna nāgĕ yemi sannasesĕno nīgu
arudugā nannum̐ gaḍu nādariṁchevu
birudugalavāṁḍavu priyamu sĕppaṁganela
yĕravula nīsuddu leḍāṁ daḍavamayyā

(||veḍu||)
ippu ḍiṭṭĕ yābĕ guṇamemi nerbĕno nīgu
kuppaḽiṁpu jĕmaḍadom̐ gūḍidi nannu
vŏppi śhrīveṁkaḍeśhuḍa vŏḍḍugoneḍim̐ki nīgu
kappi nīsuddulu ne magaḍu seyamayyā