వేడుకకాఁడవు నీకు వెఱపేఁటికి
(॥పల్లవి॥)
వేడుకకాఁడవు నీకు వెఱపేఁటికి
యేడ నీవేమి సేసినా నెగ్గులున్నవా
(॥॥)
నిలుచుండి నిన్నుఁ దప్పకచూచితే
చెలరేఁగి సిగ్గులతోడఁ జిమ్మిరేఁగేవు
కలపనసేసి నీకు గందము వూయరాఁ గా
బలిమిఁ బచ్చడమేల పైఁగుప్పేవు
(॥॥)
చెంగట నుండి నీసతి చేఁతలెల్లాఁ బొగడితే
వెంగమంటా నీవేల వింతసేసేవు
వుంగరము చూతమని వొయ్యనే వేలువట్టితే
కొంగువట్టి యాపెనెంత కొచ్చిచేచూపు
(॥॥)
విడెమిచ్చి తమ్ములము వెలఁది వుమియుమంటే
నడుమ నీవేమిటికి నవ్వునవ్వేవు
యెడయక శ్రీవేంకటేశ యీకెఁ గూడితేను
తడఁబాటులెల్లా మాని దయదలఁ చేవు
(||pallavi||)
veḍugagām̐ḍavu nīgu vĕṟabem̐ṭigi
yeḍa nīvemi sesinā nĕggulunnavā
(||||)
nilusuṁḍi ninnum̐ dappagasūside
sĕlarem̐gi sigguladoḍam̐ jimmirem̐gevu
kalabanasesi nīgu gaṁdamu vūyarām̐ gā
balimim̐ bachchaḍamela paim̐guppevu
(||||)
sĕṁgaḍa nuṁḍi nīsadi sem̐talĕllām̐ bŏgaḍide
vĕṁgamaṁṭā nīvela viṁtasesevu
vuṁgaramu sūdamani vŏyyane veluvaṭṭide
kŏṁguvaṭṭi yābĕnĕṁta kŏchchisesūbu
(||||)
viḍĕmichchi tammulamu vĕlam̐di vumiyumaṁṭe
naḍuma nīvemiḍigi navvunavvevu
yĕḍayaga śhrīveṁkaḍeśha yīgĕm̐ gūḍidenu
taḍam̐bāḍulĕllā māni dayadalam̐ sevu