వేడుకకాఁడవౌదు నీవింతలెల్లాఁ గంటిమి
(॥పల్లవి॥)
వేడుకకాఁడవౌదు నీవింతలెల్లాఁ గంటిమి
యీడుజోడాయ వలపు లిదిగో నీభాగ్యము
(॥వేడు॥)
కంకణసూడిగాలాపె కస్తూరి నామము వెట్టి
కుంకుమ గందము పూసి గుబ్బలు సోఁక
వంకరగోళ్లతోడ వడిఁ గోప్పుముడిచీని
ఇంక నేమిచెప్పేది ఇదివో నీభాగ్యము
(॥వేడు॥)
మొలనూలిగంటలాపె ముంచి నీపాదాలు గుద్ది
తలగడవెట్టి మోముతావి వలయ
పలుకుఁదేనెలు గారఁ బాటవాడీ నీయెదుట
ఇలపై నెన్నికకెక్కె నిదివో నీభాగ్యము
(॥వేడు॥)
అందెలసూడిగాలాపె అండనుండి విడెమిచ్చి
అందిఇచ్చీ కొనవేళ్ల నాకుమడిచి
చెంది యలమేల్‌మంగను శ్రీవేంకటేశుఁడవు
ఇందు నిట్టె నన్నేలితి విదివో నీభాగ్యము
(||pallavi||)
veḍugagām̐ḍavaudu nīviṁtalĕllām̐ gaṁṭimi
yīḍujoḍāya valabu lidigo nībhāgyamu
(||veḍu||)
kaṁkaṇasūḍigālābĕ kastūri nāmamu vĕṭṭi
kuṁkuma gaṁdamu pūsi gubbalu som̐ka
vaṁkaragoḽladoḍa vaḍim̐ goppumuḍisīni
iṁka nemisĕppedi idivo nībhāgyamu
(||veḍu||)
mŏlanūligaṁṭalābĕ muṁchi nībādālu guddi
talagaḍavĕṭṭi momudāvi valaya
palugum̐denĕlu gāram̐ bāḍavāḍī nīyĕduḍa
ilabai nĕnnigagĕkkĕ nidivo nībhāgyamu
(||veḍu||)
aṁdĕlasūḍigālābĕ aṁḍanuṁḍi viḍĕmichchi
aṁdiichchī kŏnaveḽla nāgumaḍisi
sĕṁdi yalamelmaṁganu śhrīveṁkaḍeśhum̐ḍavu
iṁdu niṭṭĕ nannelidi vidivo nībhāgyamu