వేడుకకాఁడైనయట్టి విభుఁడు గాక
(॥పల్లవి॥)
వేడుకకాఁడైనయట్టి విభుఁడు గాక
కోడెతనాలు సేసీని గోలవాఁడా యీతఁడు
(॥వేడు॥)
పసిఁడికుండలవుట్లు బాలకృష్ణుఁడు గొట్టఁగా
వెస నొక్కతె చన్నులు వీఁపు నాటఁ బట్టితీసె
యెసఁగి యాకుండలే యేవి యని తానంతలో
పిసికీఁ జేతులఁ బట్టి పిన్నవాఁడా యీతఁడు
(॥వేడు॥)
కోనలజుంటి పెరలగుదులవుట్టి గొట్టఁగా
తేనెమోవిని గోవిందుఁ దిట్టె నొకతె
మోనమున నాతేనెమోవి తేనెగా సవి
పానిపట్టి చవిచూచీ పసిబిడ్డ యీతఁడు
(॥వేడు॥)
పాలవుట్లు శ్రీవేంకటపతి గొట్టఁగా నొకతె
పాలవంటినవ్వు నవ్వి పదరి సిగ్గువరచె
పాలదియే పడఁతి సెలవినంటా
నాలితో వారవట్టీ సన్నపువాఁడా యీతఁడు
(||pallavi||)
veḍugagām̐ḍainayaṭṭi vibhum̐ḍu gāga
koḍĕdanālu sesīni golavām̐ḍā yīdam̐ḍu
(||veḍu||)
pasim̐ḍiguṁḍalavuṭlu bālakṛṣhṇum̐ḍu gŏṭṭam̐gā
vĕsa nŏkkadĕ sannulu vīm̐pu nāḍam̐ baṭṭidīsĕ
yĕsam̐gi yāguṁḍale yevi yani tānaṁtalo
pisigīm̐ jedulam̐ baṭṭi pinnavām̐ḍā yīdam̐ḍu
(||veḍu||)
konalajuṁṭi pĕralagudulavuṭṭi gŏṭṭam̐gā
tenĕmovini goviṁdum̐ diṭṭĕ nŏgadĕ
monamuna nādenĕmovi tenĕgā savi
pānibaṭṭi savisūsī pasibiḍḍa yīdam̐ḍu
(||veḍu||)
pālavuṭlu śhrīveṁkaḍabadi gŏṭṭam̐gā nŏgadĕ
pālavaṁṭinavvu navvi padari sigguvarasĕ
pāladiye paḍam̐ti sĕlavinaṁṭā
nālido vāravaṭṭī sannabuvām̐ḍā yīdam̐ḍu