వేడుకకాఁడ వౌదువు వింతమాసటీఁడ వౌదు
(॥పల్లవి॥)
వేడుకకాఁడ వౌదువు వింతమాసటీఁడ వౌదు-
వేడ చూచినా మెచ్చేరు యింతులెల్లా మిమ్మును
(॥॥)
తెఱవఁ బెండ్లియాడి తేరుమీఁద నేఁగిరాఁగా
చిఱుఁజెమటలు గారెఁ జెక్కులమీఁద
మెఱయుచు వీదులను మించి విఱ్ఱవీఁగఁగాను
నెఱవాదిసాముల నిట్టూర్పులు నిండెను
(॥॥)
బాసికము గట్టుకొని పడఁతితో మెఱయఁగ
సేసముత్తేలు చూపట్టె శిరసుల పై
ఆసతో వాడలనెల్లా నారుతులె త్తించుకోఁగా
పోసరించి మోముల గొబ్బున మించెఁగళలు
(॥॥)
అలమేలుమంగఁ గూడి అట్టె వసంతాలాడఁగ
చెలఁగెఁ బులకలు మెయి శ్రీవెంకటేశ
వెలయ నిండ్లనెల్లా విందు తారగించఁగాను
వలపులు మోవిమీఁద వన్నెచూపె నిపుడు
(||pallavi||)
veḍugagām̐ḍa vauduvu viṁtamāsaḍīm̐ḍa vaudu-
veḍa sūsinā mĕchcheru yiṁtulĕllā mimmunu
(||||)
tĕṟavam̐ bĕṁḍliyāḍi terumīm̐da nem̐girām̐gā
siṟum̐jĕmaḍalu gārĕm̐ jĕkkulamīm̐da
mĕṟayusu vīdulanu miṁchi viṭravīm̐gam̐gānu
nĕṟavādisāmula niṭṭūrbulu niṁḍĕnu
(||||)
bāsigamu gaṭṭugŏni paḍam̐tido mĕṟayam̐ga
sesamuttelu sūbaṭṭĕ śhirasula pai
āsado vāḍalanĕllā nārudulĕ ttiṁchugom̐gā
posariṁchi momula gŏbbuna miṁchĕm̐gaḽalu
(||||)
alamelumaṁgam̐ gūḍi aṭṭĕ vasaṁtālāḍam̐ga
sĕlam̐gĕm̐ bulagalu mĕyi śhrīvĕṁkaḍeśha
vĕlaya niṁḍlanĕllā viṁdu tāragiṁcham̐gānu
valabulu movimīm̐da vannĕsūbĕ nibuḍu