Vedugagaamda vauduvu veṟabemtigi

వేడుకకాఁడ వౌదువు వెఱపేఁటికి
Language

(॥పల్లవి॥)
వేడుకకాఁడ వౌదువు వెఱపేఁటికి
పాడిపంతా లెంచి నేను పచారించనేఁటికి

(॥వేడు॥)
కొంకులేక నీవూ నాపెఁ గూడినందుకు నీమేని-
పంకపుఁజెమటే చెప్పీ బాసలేఁటికి
ఇంకనేమి నీవాపెను ఇంటఁ బెట్టుకున్నందుకు
అంకెఁ జెలులచే వింటి నాడనేఁటికి

(॥వేడు ॥)
కలికిచన్నుల మీఁదిగందము నీమేన నంటె
చెలులెల్లా నెరిఁగిరి సిగ్గులేఁటికి
వెలయ న న్నిందుకు వేఁడుకొనే విటు నీవు
తలఁచినట్టెల్లానాయ దాఁచనేఁటికి

(॥వేడు॥)
చెంతల నాచెల్లెలంటాఁ జెప్పేవు చుట్టరికము
వింతలు నీవల్లఁ గంటి వేసాలేఁటికి
ఇంతటా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
చింతలేదు యిఁక గుట్టు సేయనేఁటికి

(||pallavi||)
veḍugagām̐ḍa vauduvu vĕṟabem̐ṭigi
pāḍibaṁtā lĕṁchi nenu pasāriṁchanem̐ṭigi

(||veḍu||)
kŏṁkulega nīvū nābĕm̐ gūḍinaṁdugu nīmeni-
paṁkabum̐jĕmaḍe sĕppī bāsalem̐ṭigi
iṁkanemi nīvābĕnu iṁṭam̐ bĕṭṭugunnaṁdugu
aṁkĕm̐ jĕlulase viṁṭi nāḍanem̐ṭigi

(||veḍu ||)
kaligisannula mīm̐digaṁdamu nīmena naṁṭĕ
sĕlulĕllā nĕrim̐giri siggulem̐ṭigi
vĕlaya na nniṁdugu vem̐ḍugŏne viḍu nīvu
talam̐sinaṭṭĕllānāya dām̐sanem̐ṭigi

(||veḍu||)
sĕṁtala nāsĕllĕlaṁṭām̐ jĕppevu suṭṭarigamu
viṁtalu nīvallam̐ gaṁṭi vesālem̐ṭigi
iṁtaḍā śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
siṁtaledu yim̐ka guṭṭu seyanem̐ṭigi