Vedugagaam didamdu vitthaleshumdu

వేడుకకాఁ డితఁడు విట్ఠలేశుఁడు
Language

(॥పల్లవి॥)
వేడుకకాఁ డితఁడు విట్ఠలేశుఁడు
వీడని పొందులు సేసీ విట్ఠలేశుఁడు

(॥వేడు॥)
వెన్నదిన్న మదమున వెలఁదులుఁ దానును
వెన్నెలలో నాడీ నిదె విట్ఠలేశుఁడు
పన్ని రతుల కింతులఁ బాంచజన్యరవమున
సన్న సేసి పిలిచీని సారె విట్ఠలేశుఁడు

(॥వేడు॥)
ఆసపడి కొలువులో నాడువారి మీఁదట
వేసీ విరులఁ గొని విట్ఠలేశుఁడు
వేసరక పదారువేలు సతులయిండ్లా
సేసవెట్టి పెండ్లాడీఁ జేరి విట్ఠలేశుఁడు

(॥వేడు॥)
మెల్లనె గందమిచ్చేటి మెలుతను గాఁగిలించి
వెల్లవిరిగాఁ గూడె విట్ఠలేశుఁడు
యిల్లిదె శ్రీవేంకటేశుఁ డితఁడె తానైవుండి
యెల్లగాఁ గోనేట వరా లిచ్చె విట్ఠలేశుఁడు

(||pallavi||)
veḍugagām̐ ḍidam̐ḍu viṭṭhaleśhum̐ḍu
vīḍani pŏṁdulu sesī viṭṭhaleśhum̐ḍu

(||veḍu||)
vĕnnadinna madamuna vĕlam̐dulum̐ dānunu
vĕnnĕlalo nāḍī nidĕ viṭṭhaleśhum̐ḍu
panni radula kiṁtulam̐ bāṁchajanyaravamuna
sanna sesi pilisīni sārĕ viṭṭhaleśhum̐ḍu

(||veḍu||)
āsabaḍi kŏluvulo nāḍuvāri mīm̐daḍa
vesī virulam̐ gŏni viṭṭhaleśhum̐ḍu
vesaraga padāruvelu sadulayiṁḍlā
sesavĕṭṭi pĕṁḍlāḍīm̐ jeri viṭṭhaleśhum̐ḍu

(||veḍu||)
mĕllanĕ gaṁdamichcheḍi mĕludanu gām̐giliṁchi
vĕllavirigām̐ gūḍĕ viṭṭhaleśhum̐ḍu
yillidĕ śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ tānaivuṁḍi
yĕllagām̐ goneḍa varā lichchĕ viṭṭhaleśhum̐ḍu